కేసీఆర్ భయమంతా కాంగ్రెస్ వల్లే.. అందుకు నిదర్శనం ఇదే!!

తెలంగాణా రాష్ట్రంలో ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అన్న చర్చ రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో వరుసగా మూడోసారి విజయం సాధించి అధికారాన్ని చేజిక్కించుకోవాలని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసిఆర్ శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. కాలికి బలపం కట్టుకొని కేసీఆర్ ప్రతి నియోజకవర్గానికి తిరుగుతున్నారు. కెసిఆర్ కు కాంగ్రెస్ పార్టీ వల్లే భయం పట్టుకుందని తాజాగా ఆయన పర్యటనలు స్పష్టం చేస్తున్నాయి.

ప్రజా ఆశీర్వాద సభలలో కెసిఆర్ ఎక్కడికి వెళ్ళినా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వస్తే ధరణి తీసేస్తారు అని, రైతుబంధుకు రాం రాం అని, ఉచిత విద్యుత్ వ్యవస్థ ఉండదని ప్రచారం చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే కాంగ్రెస్ పార్టీని తూర్పారబడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ భుజం మీద గొడ్డలి పెట్టుకుని సిద్ధంగా ఉందని ఒకవేళ వాళ్ళు అధికారంలోకి వస్తే తీవ్రమైన నష్టం జరుగుతుందని కేసీఆర్ చెబుతున్నారు.

All the fear of KCR is because of Congress.. This is the proof!!

కాంగ్రెస్ పార్టీ మూడు గంటల కరెంటు ఇస్తామని చెబుతుంద,ని కర్ణాటకలో తీపిమాటలు చెప్పి అధికారంలోకి రాగానే 5గంటల కరెంటు మాత్రమే ఇస్తున్నారని కెసిఆర్ విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి డజన్ మంది సీఎంలు ఉన్నారని ఒకవేళ అవకాశం వస్తే సీఎం పదవి కోసం వాళ్లు కొట్టుకోవడమే సరిపోతుందని కెసిఆర్ చెబుతున్నారు. కాంగ్రెస్ మాదిరిగా తమ హై కమాండ్ ఢిల్లీలో లేదని తెలంగాణ రాష్ట్రంలోనే ఉందని కనుక లోకల్ ను ఆదరించాలని అంటున్నారు.

కెసిఆర్ ఎక్కడ బహిరంగ సభలో మాట్లాడినా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని మాత్రమే టార్గెట్ చేయడం కనిపిస్తుంది. బిజెపి పై కేసీఆర్ విమర్శలు చేసినా, అవి కాంగ్రెస్ తో కంపేర్ చేస్తే చాలా తక్కువ. కాబట్టి సీఎం కెసిఆర్ ఈ ఎన్నికలకు కాంగ్రెస్ తోనే ప్రధానంగా భయపడుతున్నారని రాష్ట్ర ప్రజల్లో ప్రధానంగా చర్చ జరుగుతుంది.

ఒకప్పుడు బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నప్పుడు బీజేపీని టార్గెట్ చేసిన కేసీఆర్ ఇప్పుడు కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తున్నారు. బీజేపీ తెలంగాణలో కాస్త వెనకబడటం ఇందుకు కారణంగా తెలుస్తుంది. మరి కాంగ్రెస్ కేసీఆర్ ను గద్దె దించే పనిలో సక్సెస్ అవుతుందా? లేదా అన్నది మాత్రం ఓటర్ల చేతిలోనే ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+