మందుబాబులకు మింగుడు పడని నిర్ణయం..!!
మందుబాబులకు పోలీసులు షాక్ ఇచ్చారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మద్యం అమ్మకాల్లో కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. 30 వేల కోట్లకు పైగా తెలుగు రాష్ట్రాల్లో మద్యం విక్రయాలు సాగుతున్నాయి. కొత్త మద్యం బ్రాండ్లు అందుబాటులోకి వస్తున్నాయి. లిక్కర్ అమ్మకాలు మరింత గా పెంచుకునేందుకు ఎక్సైజ్ శాఖ కొత్త ప్రణాళికలు అమలు చేస్తోంది. ధరల పెంపు పైన తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇదే సమయంలో మద్యం అమ్మకాల విషయంలో మందుబాబు లకు షాక్ ఇస్తూ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు.
లిక్కర్ షాపుల బంద్
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 24 గంటల పాటు వైన్ షాపులు అన్నీ మూసేయాలని పోలీసు అధికారులు ఆదేశించారు. హనుమాన్ జయంతి సందర్భంగా నగర కమిషనర్ సీవీ ఆనంద్ ఈ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 12 ఉదయం 6 గంటల నుంచి 13వ తేదీ ఉదయం 06 గంటల వరకు మూసివేయాలని తెలిపారు. మద్యం దుకాణాలతో పాటు కల్లు దుకాణాలు, బార్‌లు కూడా మూసివేయా లన్నారు. జంటనగరాల్లో ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని అందరూ సహకరించాల ని కోరారు. ప్రజలంతా ఆనందోత్సాహాల మధ్య హనుమాన్ జయంతి జరుపుకోవాలని సూచించారు. ఏప్రిల్ 6న శ్రీరామ నవమి సందర్భంగా కూడా రాష్ట్రవ్యాప్తంగా వైన్ షాపులను మూసేశారు.

కొత్త బ్రాండ్ల ఎంట్రీ
తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు నెలకొల్పుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న అమ్మ కాలు మరింత పెంచుకునేందుకు మందుబాబులకు అందుబాటులోకి కొత్త బ్రాండ్లు తెచ్చేందుకు రంగం సిద్దమైంది. తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మద్యానికి జారీ చేసిన ప్రకటనకు అనూహ్య స్పందన వచ్చింది. ఈ ప్రకటనతో మద్యం సరఫరాదార్లు, తయారీ దార్లు మధ్య పోటాపోటీ నెలకొని దరఖాస్తులు అధికంగా వచ్చాయి. తాము 604 రకాల మద్యం బ్రాండ్లను సరఫరా చేస్తామంటూ 92 మద్యం సరఫరా కంపెనీలు దరఖాస్తులు చేసుకున్నాయి. ఈ 604 బ్రాండ్లలో 331 ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ కొత్త బ్రాండ్లు కాగా, 273 ఫారిన్ బ్రాండ్లు ఉన్నాయి.
లక్ష్యాలపై ఫోకస్
కాగా, 47 కొత్త కంపెనీల నుంచి 386 బ్రాండ్ల సరఫరా కోసం, 45 పాత కంపెనీల నుంచి 218 బ్రాండ్ల సరఫరా కోసం మద్యం దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో మద్యం సరఫరాలో కంపెనీల ఏకఛత్రాధిపత్యం ఉండకుండా ఉండేందుకు కొత్త కంపెనీలను మద్యం సరఫరాలకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వ ప్రయత్నిస్తోంది. ఇందుకు తొలుత ఫిబ్రవరి 23న నోటిఫికేషన్ ఇవ్వగా మార్చి 15 వరకు దరఖాస్తు చేసుకోవడానికి సమయం ఇచ్చారు. కొత్తగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన తరువాత కొత్త బ్రాండ్లను అనుమతి ఇచ్చేలా ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తోంది. ఇదే సమయంలో మద్యం ఆదాయం పెంచుకునేలా కొత్త ప్రతిపాదనలను ప్రభుత్వం ముందు ఉంచారు.












Click it and Unblock the Notifications