హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వివాదాల్లో తెలంగాణ డీహెచ్ శ్రీనివాసరావు.. మిరపకాయలతో హోమం.. అసలు జరిగిందేమిటంటే.!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ హెల్ డైరెక్టర్ శ్రీనివాసరావుకు దేవుడు కరుణించాడో లేదో కాని ఆయన నిర్వహించిన పూజలు మాత్రం వివాదాస్పదమయ్యాయి. కొత్త చిక్కులు తెచ్చిపెట్టాయి. స్వయం ప్రకటిత దేవతనంటూ చెప్పుకుంటున్న టీఆర్ఎస్ ఎంపీపీ చూట్టూ ప్రదక్షిణలు చేశారు. అంతే కాదు హోమంలో మిరపకాయలు వేసి మరి పూజలు నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో డీహెచ్ శ్రీనివాసరావు వ్యవహరంపై విమర్శలు వెల్లవెత్తుతున్నాయి. తన రాజకీయ ఎంట్రీ కోసమే ఈ క్షుద్ర పూజలంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది.

హోమంలో మిరపకాయలు వేసి పూజలు

హోమంలో మిరపకాయలు వేసి పూజలు

ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సుజాత నగర్ మండలం, పాత అంజనాపురం పంచాయతీ జిమ్నా తండాలో చోటు చేసుకుంది. సుజాతనగర్ టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీపీ విజయలక్ష్మీ. తనకు తాను దేవతగా ప్రకటించుకుని ప్రత్యేకంగా హోమం నిర్వహించారు. ఈ హోమంలో హెల్త్ డైరెక్టర్ డీహెచ్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. తలపాగా చుట్టుకుని హోమం చుట్టూ తిరిగారు. మిరపకాయలు హోమంలో వేసి పూజలు చేయండం అందులోనూ రాత్రి సమయంలో హోమంలో శ్రీనివాసరావు పాల్గొనడం వివాదస్పదమవుతోంది. విమర్శలు వెల్లవెత్తుతున్నాయి.

క్షుద్రపూజల్లో పాల్గొనలేదని క్లారీటీ

క్షుద్రపూజల్లో పాల్గొనలేదని క్లారీటీ

దీనిపై డిహెచ్ తెలంగాణ హెల్ డైరెక్టర్ శ్రీనివాసరావు స్పందించారు. తాను ఎలాంటి క్షుద్రపూజల్లో పాల్గొనలేదని క్లారీటీ ఇచ్చారు. స్థానిక గిరిజనుల ఆచారాలను గౌరవించి ప్రత్యంగిరాదేవి అమ్మవారి పూజా కార్యక్రమల్లో పాల్గొన్నానని చెప్పారు. స్వయం ప్రకటిత దేవతతో తనుకు సంబంధం లేదని స్పషం చేశారు. మూడనమ్మకాలను తాను విశ్వసించనని అమ్మవారి హోమం పూజా కార్యక్రమాల్లో స్థానికులతో కలిసి మాత్రమే పాల్గొన్నానని తేల్చి చెప్పారు. కావాలని కొందరు ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మవారి పూజల్లో పాల్గొంటే తప్పేంముందని శ్రీనివాసరావు ప్రశ్నించారు.

గిరిజన సంప్రదాయంలో జరిగే పత్యంగిరాదేవి హోమం..

గిరిజన సంప్రదాయంలో జరిగే పత్యంగిరాదేవి హోమం..

అటు ఈ హోమం పూజలపై నిర్వాహులు కూడా వివరణ ఇచ్చారు. ఇది తమ కుల దేవతను పూజిస్తూ.. గిరిజన సంప్రదాయంలో జరిగే పత్యంగిరాదేవి హోమం అని తెలిపారు. ప్రతి వారం తమ గ్రామలో హోమం నిర్వహించడం అనవాయితి అని చెప్పారు. పాల్వంచలో ఈనెల 24న తన ట్రస్టు ద్వారా మెగా వైద్య శిబిరం నిర్వహించాలని డిహెచ్ శ్రీనివాస రావు నిర్ణయించారు. ఇందులో భాగంగా కొత్తగూడెంకు వచ్చారు. స్థానిక ఎంపీపీ విజయలక్ష్మీ ఆహ్వానం మేరకు హోమంలో పాల్గొన్నారు. అయితే దీనికి కొందరూ తప్పుగా అర్థం చేసుకున్నారని నిర్వహులు పేర్కొన్నారు.

English summary
TS Health director srinivasa rao clarity worship in Khammam .. Whats actually Happened..
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X