టిడిపిని నిలబెట్టేనా: రేవంత్ వ్యాఖ్యల దుమారం, బీజేపీ ఆగ్రహం

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఇప్పటికే ఏపీలో టిడిపి - బీజేపీ మధ్య అప్పుడప్పుడు విభేదాలు కనిపిస్తున్నాయి. మిత్రపక్షాలు విడిపోతాయని, కాదు కాదు కలిసే ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయని పలుమార్లు వార్తలు వచ్చాయి. అంటే ఆ రెండు పార్టీల మధ్య వాగ్వాదం చూస్తే అలాంటి పరిస్థితులు కనిపించాయి.

తెలంగాణలోను ఇరు పార్టీల మధ్య విభేదాలు కనిపిస్తున్నాయి. అసలు టిడిపితో కలిసి ఉండటం తెలంగాణ బీజేపీ నేతలకు ఏమాత్రం ఇష్టం లేదు. అయినప్పటికీ అధిష్టానం ఆదేశాల మేరకు టిడిపితో కలిసి ముందుకు వెళ్లారు. తాజాగా, టిడిపి - బీజేపీ నేతల మధ్య తెలంగాణలోను మాటల యుద్ధం కనిపిస్తోంది.

రేవంత్ రెడ్డి ఆందోళన, కోదండరాం ప్రశ్న: కేసీఆర్ దిగొస్తున్నారా?

తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీల పైన రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఆ పార్టీల తీరు ఒకేలా ఉందని అభిప్రాయపడ్డారు. దీనిపై బీజేపీ నేతలు కౌంటర్ ఇచ్చారు.

దీనిపై బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణ సాగర రావు మాట్లాడుతూ... తెలంగాణలో టిడిపి కనుమరుగయిందని, ఖాళీ పాత్ర ఎక్కువ చప్పుడు అవుతుందని టిడిపిని, రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

Allies TDP-BJP continue to fight

రేవంత్ రెడ్డి వ్యాఖ్యల వెనుక ఆ పార్టీ ఎంత ఒత్తిడిలో ఉందో తెలుస్తోందన్నారు. టిడిపి పూర్తి నిరాశలో ఉందన్నారు. అసలు టిడిపిని అధికార టిఆర్ఎస్ పార్టీలో విలీనం చేస్తారా లేదా రేవంత్ రెడ్డి మొదట చెప్పాలని డిమాండ్ చేశారు. అసలు తెలంగాణలో టిడిపి ఉందా అని ప్రశ్నించారు.

తెలంగాణలో అధికార తెరాసకు బీజేపీయే ప్రత్యామ్నాయం అన్నారు. తెలంగాణలో పూర్తిగా చచ్చిపోయిన పార్టీని రేవంత్ రెడ్డి పునరుద్ధరించాలనుకోవడం విడ్డూరమన్నారు. అది అసాధ్యమని ఆయన తెలుసుకోవాలన్నారు.

కేసీఆర్ సూపర్, ఆయనను చూసి చేయండి: జయలలితకు సూచన
అంతకుముందు, రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ కాంగ్రెస్, బీజేపీలు అధికార తెరాసకు తోక పార్టీలుగా మారాయని మండిపడ్డారు. తాము వారిలా ప్రభుత్వం అనుకూల, భజన పార్టీగా మారాలని భావించడం లేదన్నారు.

కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడుతున్నారన్నారు. ఒకరు హరితహారం బాగుందంటే, మరొకరు అందులో పెద్ద కుంభకోణం జరిగిందంటారని ఎద్దేవా చేశారు. జీహెచ్ఎంసీ రూ.5 భోజనాన్ని ఒకరు మెచ్చుకుంటే, మరొకరు తిడతారన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Simmering differences between allies BJP and TD on Friday reached a flashpoint. It all began with TS TD working president A. Revanth Reddy saying that the Congress and BJP better close their units in the state. His comments earned him a sharp rebuke from the BJP.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి