తెలంగాణలో కొత్త మంత్రులకు శాఖలు కేటాయింపు.. ఎవరికి ఏవంటే ?
తెలంగాణలో ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన ముగ్గురు కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నూతన మంత్రులకు కీలక బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
మంత్రులకు కేటాయించిన శాఖలు..
అడ్లూరి లక్ష్మణ్ (ధర్మపూరి) - ఎస్సీ, ఎస్టీ మరియు మైనార్టీ సంక్షేమ శాఖలు
గడ్డం వివేక్ (చెన్నూరు) - కార్మిక, మైనింగ్ శాఖలు
వాకాటి శ్రీహరి (మక్తల్) - క్రీడలు, యువజన సర్వీసులు, పశుసంవర్థక శాఖలు

జూన్ 8న సీఎం రేవంత్ రెడ్డి తన కేబినెట్‌ను విస్తరించగా.. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు నూతన మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, అప్పట్లో శాఖల కేటాయింపు విషయంలో స్పష్టత లేకపోవడంతో పార్టీ వర్గాల్లో ఇది హాట్ టాపిక్‌గా మారింది.
కాగా శాఖల కేటాయింపుపై తుది నిర్ణయం తీసుకోవడానికి కాంగ్రెస్ అధిష్టానం పెద్ద కసరత్తే చేసింది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ లతో ఇందిరా భవన్‌లో సమావేశమయ్యారు. సుమారు గంటన్నర పాటు ఈ అంశంపై చర్చలు జరిపారు. మంత్రుల సీనియార్టీ, అనుభవాన్ని పరిగణలోకి తీసుకొని ఎవరికి ఏ శాఖలు కేటాయించాలన్న దానిపై విశ్లేషణ జరిగి, చివరకు తుది నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తుది నిర్ణయంతో కొత్త మంత్రుల శాఖలు స్పష్టమవడంతో, వారు త్వరలోనే తమ శాఖల బాధ్యతలు స్వీకరించి కార్యాచరణ ప్రారంభించే అవకాశం ఉంది.
-
సీఎం గారు లక్షమందిని కాపాడండి.. రేవంత్ రెడ్డికి వినూత్న విజ్ఞప్తి! -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం -
హైదరాబాద్ లో 'స్నో వరల్డ్'.. మంచులో ఫుల్ ఎంజాయ్.. తక్కువ ధరకే..! -
తెలంగాణాలో ఆ గ్రామానికి గ్యాస్ చింతే లేదు.. ఎందుకంటే! -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు











Click it and Unblock the Notifications