Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆత్మహత్యకు అనుమతివ్వండి.. హృదయాలను పిండేస్తున్న రైతు దంపతుల వ్యధ!

తెలంగాణ రాష్ట్రంలో తన సమస్యను పరిష్కరించండి మహాప్రభో అంటూ అధికారుల చుట్టూ తిరిగిన ఓ రైతు చివరకు తమకు ఆత్మహత్యకు అయినా అనుమతించండి సారు అంటూ రోడ్డెక్కిన ఘటన చోటుచేసుకుంది. నేలతల్లినే నమ్ముకుని బ్రతుకుతున్న రైతు కుటుంబం ఆ భూమికి దూరం కావటంతో ఆందోళన బాట పట్టారు. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే..

కలెక్టరేట్ ముందు వృద్ధ రైతు దంపతుల ఆందోళన
భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం వేములపల్లికి చెందిన నంది సులోచన, ప్రతాప్ రెడ్డి దంపతులు తమ సాగుభూములోకి తమను ఒక ఎస్ఐ వెళ్ళనివ్వడం లేదని అడిగితే అక్రమ కేసులు పెట్టడంతో పాటు గత మూడు సంవత్సరాలుగా తమను వ్యవసాయం చేయనివ్వడం లేదని లబోదిబోమన్నారు. ఎంతమంది అధికారులకు చెప్పినా సమస్య పరిష్కారం కావడం లేదని ఆవేదన చెందుతున్న వృద్ధ దంపతులు కలెక్టరేట్ ఎదుట ఫ్లెక్సీ పట్టుకొని శాంతియుతంగా తమ నిరసన వ్యక్తం చేశారు.

Allow to commit suicide The heartbreaking plight of the farmer couple before bhupalpally collectorate

ఎస్సైతో వృద్ధ రైతు భూమి పంచాయితీ
తమ సమస్యలైనా పరిష్కరించండి లేదంటే ఆత్మహత్యకు అనుమతించండి అంటూ కలెక్టరేట్ ముందు లబోదిబోమన్నారు. సులోచన, ప్రతాప్ రెడ్డి దంపతులకు వేములపల్లి గ్రామంలో 12ఎకరాల వ్యవసాయభూమి ఉంది. అయితే ఆ భూమి పక్కనే ములుగు జిల్లా కన్నాయిగూడెం ఎస్ఐ వెంకటేష్ అతని కుటుంబ సభ్యులకు పొలం ఉంది. ప్రతాపరెడ్డి పొలానికి వెళ్లే బండ్ల బాటను ఎస్ఐ ఆయన కుటుంబ సభ్యులు కలిసి 2022 మే15వ తేదీన దున్ని తమ భూమిలో కలుపుకున్నారు.

ఎస్సై తమపైన అక్రమ కేసులు పెట్టాడని రైతు దంపతుల ఆరోపణ
అప్పటినుంచి వీరి పొలానికి వెళ్లడానికి బండ్లబాట లేకుండా పోయింది. ఇక ఈ దంపతులను భూమిలోకి అడుగుపెట్టనీయకుండా ఎస్సై అడ్డుకుంటున్నాడు. ఇక ఇదేమిటి అని ప్రశ్నించినందుకు ఎస్సై తమపైన అక్రమ కేసులు పెట్టారని ఆ వృద్ధ దంపతులు చెబుతున్నారు. 2023 డిసెంబర్ 12న సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన ప్రజాదర్బార్ లో కూడా ఫిర్యాదు చేశారు.

రైతుకు అనుకూలంగా ఆదేశాలు ఉన్నా పట్టించుకోవటం లేదని నిరసన
ఎస్సై తమ పైన అక్రమ కేసులు పెట్టాడని వాటి వల్ల తమ పొలంలోకి వెళ్లలేక పోతున్నామని ఇప్పటికి అనేకమార్లు ఫిర్యాదు చేయగా దీనిపైన దర్యాప్తు చేసిన మొగుళ్లపల్లి తహసిల్దార్, ఎస్సై బాటను పునరుద్ధరించాలని ఆదేశించారని తెలిపారు. అయితే ఆదేశాలు ఇప్పటివరకు అమలు కాలేదు. అధికారుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్న ప్రయోజనం లేదు. ఈ క్రమంలోనే ఆ వృద్ధ దంపతులు ఆత్మహత్యకు అనుమతించండి సార్ అంటూ కలెక్టరేట్ ముందు నిరసన తెలిపారు. మరి ఈ వ్యవహారంలో ఇప్పటికైనా అధికార యంత్రాంగం వృద్ధ దంపతుల సమస్యను పరిష్కరిస్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+