భూతగాదా: రంగారెడ్డి కోర్టుకు అల్లు అర్జున్, రాజీ కుదుర్చుకున్నారు
హైదరాబాద్: టాలీవుడ్ స్టైలిష్ హీరో అల్లు అర్జున్ సోమవారం నాడు రంగారెడ్డి జిల్లా న్యాయస్థానానికి హాజరయ్యారు. కుటుంబానికి సంబంధించి ఒక సివిల్ కేసు విషయంలో రాజీ కుదుర్చుకునే అంశంపై ఆయన ఇవాళ కోర్టుకు హాజరయ్యారు.

2009లో నార్సింగిలోని భూ తగాదా విషయమై రాహుల్ అనే వ్యక్తి కేసు వేశాడు. ఈ కేసుకు సంబంధించి అల్లు అర్జున్ కోర్టుకు వచ్చారు. ఇవాళ కోర్టులో జరిగిన లోక్ అదాలత్‌లో ఈ భూమి విషయంలో ఇరు వర్గాలు రాజీకి వచ్చాయి.

రాజీ అనంతరం అల్లు అర్జున్ తిరిగి వెళ్లిపోయారు. అల్లు అర్జున్ రాక నేపథ్యంలో ఆయనను చూసేందుకు కోర్టుకు వచ్చిన కక్షిదారులు, లాయర్లు ఉత్సుకత ప్రదర్శించారు. కాగా, సుమారు ఆరేళ్లుగా సాగుతున్న ఈ తగాదా విషయం కొలిక్కి వచ్చినట్లయింది.












Click it and Unblock the Notifications