అల్లు అర్జున్ క్షమాపణలు - ఎమోషనల్..!!
అల్లు అర్జున్ భావోద్వేగానికి గురయ్యారు. జైలు నుంచి విడుదల తరువాత అల్లు అర్జున్ ను మెగా కుటుంబ సభ్యులతో పాటుగా సినీ ప్రముఖులు పరామర్శించారు. చిరంజీవి సతీమణి రాగానే ఒక్క సారిగా ఉద్వేగ భరిత వాతావరణం ఏర్పడింది. అల్లు అర్జున్ ను ఆలింగనం చేసుకొని సురేఖ ఉద్వేగంతో కనిపించారు. బాధితు కుటుంబానికి మద్దతుగా నిలుస్తామని అల్లు అర్జున్ ప్రకటిం చారు. తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ పరామర్శ కోసం వెళ్తానని వెల్లడించారు.
అల్లు అర్జున్ కీలక ప్రకటన చేసారు. తొక్కిసలాట ఘటన అనుకోకుండా జరిగిందని చెప్పారు. బాధిత కుటుంబాన్ని త్వరలో కలుస్తానని వెల్లడించారు. బాధిత కుటుంబానికి అల్లు అర్జున్ క్షమాపణ చెప్పారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన తమ కంట్రోల్ లో లేదని అల్లు అర్జున్ వివరించారు. ఈ పరిణామల వేళ తనకు మద్దతుగా నిలిచిన అందరికీ అల్లు అర్జున్ ధన్యవాదాలు తెలిపారు. ఘటన అనుకోకుండా జరిగిందని చెప్పుకొచ్చారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రేవతి కుమారుడు శ్రీతేజను పరామర్శిస్తానని వెల్లడించారు. తాను 20 ఏళ్లుగా సంధ్యా థియేటర్ లో సినిమా చూస్తున్నానని అల్లు అర్జున్ పేర్కొన్నారు.

అరెస్ట్ తరువాత దేశ వ్యాప్తంగా అల్లు అర్జున్ అంశం కలకలం రేపింది. దేశ వ్యాప్తంగా ఈ అరెస్ట్ పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఆసక్తికర పరిణామాల వేళ అల్లు అర్జున్ ను జైలుకు తరలించారు. హైకోర్టు బెయిల్ ఇవ్వటం ఈ ఉదయం ఇంటికి చేరు కొన్నారు. విడుదలైన వెంటనే గీతా ఆర్ట్స్ ఆఫీస్‌కు వెళ్లిన బన్నీ.. ఆ తర్వాత ఇంటికి చేరుకున్నారు. ఇంట్లోకి అడుగుపెట్టిన వెంటనే తన కుమారుడు అల్లు అయాన్‌ను హత్తుకున్నారు. కొడుకును కౌగిలించుకొని తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. అప్పటికే కుమార్తె తన తండ్రి కోసం ఎదురు చూస్తున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.












Click it and Unblock the Notifications