అల్లు అర్జున్‌ను అలా చూడలేకపోతున్నా..: అరవింద్ ఆవేదన

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి సంధ్య థియేటర్ ఘటనపై స్పందిస్తూ సినీనటుడు అల్లు అర్జున్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి అల్లు అర్జున్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. సంధ్య థియేటర్ ఘటన దురదృష్టకరమని, అది ఒక ప్రమాదమని అన్నారు. తన అభిమానులైన రేవతి చనిపోవడం, ఆమె కుమారుడికి తీవ్రగాయాలవడం తనను ఎంతో బాధించాయన్నారు.

అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడిన అనంతరం ఆయన తండ్రి, నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడారు. దయచేసి అర్థం చేసుకోండి. న్యాయపరమైన సమస్యలు ఎదురవుతాయనే ఉద్దేశంతోనే మీ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా అల్లు అర్జున్ వెళ్లిపోయారు అని మీడియాతో అల్లు అర్జున్ పేర్కొన్నారు. తాను చేసిన పాన్ ఇండియా మూవీని థియేటర్‌లో చూసుకుందామనే అల్లు అర్జున్ వెళ్లాడని చెప్పారు.

Allu Arjun is in pain after the Sandhya Theater incident Allu Aravind

థియేటర్ వద్ద జరిగిన ఘటన తర్వాత అల్లు అర్జున్ మా ఇంట్లో గార్డెన్‌లో ఓ మూలన కూర్చొని అదే ఆలోచనలో ఉంటున్నాడు. పలువురు సక్సెస్ సెలబ్రేషన్స్ చేస్తామని చెబుతున్నా.. ఎక్కడికీ వెళ్లడం లేదు. ఒక అభిమాని కుటుంబం ఇలా అయిపోయిందని బాధపడుతున్నాడు. ఓ తండ్రిగా అతడ్నిలా చూస్తుంటే.. నాకే కడుపు తరుక్కుపోతోంది. 22 సంవత్సరాలు కష్టపడి ఈ పేరు సంపాదించుకున్నాడు. ఇదంతా ఒక రాత్రి, ఒక సినిమా, ఒక ప్రెస్‌మీట్‌లో రాలేదని అరవింద్ చెప్పారు.

శ్రీతేజ్ విషయంలో బాధ్యత లేదని అంటున్నారని.. శ్రీతేజ్ కుటుంబానికి ఆదుకోవడానికి తాము చర్చించి నిర్ణయం తీసుకున్నామని అరవింత్ తెలిపారు. మైత్రీ మూవీ మేకర్స్, థియేటర్ యాజమాన్యం, తాము మనీ కలెక్ట్ చేసి సహాయం చేద్దామని అనుకున్నామని.. ఆ విషయం చెబుతామని అంటే.. ఇది సమయం కాదని బన్నీ అన్నారని అరవింద్ తెలిపారు. అది మరో సందర్భంలో చెప్తామన్నారు.

మూడు తరాలుగా మా కుటుంబం గురించి తెలుసు. ఎప్పుడైనా ఇలా వ్యవహరించామా? మీ కళ్ల నుంచి తప్పించుకుని ఇన్నేళ్లు ఉండగలమా? మాపై అసత్య ప్రచారాలు చేస్తుంటే.. బాధగా ఉంది. అందుకే మీ ముందుకు వచ్చాం. ప్రజలు ఆదరిస్తే పైకి వచ్చిన కుటుంబం ఇది. ఆ అభిమానాన్ని ఇలాగే కొనసాగించాలని కోరుతున్నాం అని అరవింద్ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+