టిఆర్ఎస్ ఎమ్మెల్యేకు ఝలక్: ఎవరూ మాట్లాడవద్దని తీర్మానం
నిజామాబాద్: తెరాస ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి నిర్లక్ష్యంతో ఆలూరు.. మండలం కాలేకపోయిందని ఆరోపిస్తూ,క ఆయనతో ఎవరూ మాట్లాడకూడదని గ్రామస్తులు గురువారం నాడు తీర్మానం చేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవ్ రెడ్డితో ఆలూరు గ్రామంలో ఎవరూ మాట్లాడవద్దని గ్రామాభివృద్ధి కమిటీ ఏకగ్రీవ తీర్మానం చేసింది.
గ్రామస్తులు అందరూ సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్్ని గ్రామాభివృద్ధి కమిటీ ప్రకటించింది. ప్రభుత్వం ప్రకటించిన ముసాయిదాలో ఆలూరు మండలం ఉందని, రాజకీయ కారణాల వల్ల సమీప గ్రామాల వారు తీర్మానాలు ఇవ్వలేదని చెప్పారు.

పక్క నియోజకవర్గంలో తీర్మానాలు లేకున్నప్పటికీ మండలాలు ఏర్పాటయ్యాయన్నారు. తీర్మానాలు ఇవ్వలేదనే సాకుతో ఆలూరును మండలంగా ఏర్పాటు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విదేశాలకు వెళ్లడంతో ఆలూరుకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు.












Click it and Unblock the Notifications