హైదరాబాద్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద అమెజాన్ క్యాంపస్, మామూలుగా లేదుగా(వీడియో)
హైదరాబాద్: ప్రపంచంలోనే అతిపెద్ద ఈ కామర్స్ సంస్థ అమెజాన్. మెరికాకు చెందిన ఈ సంస్థ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తమ కార్యాకలాపాలను విస్తరించింది. మరీ ముఖ్యంగా అత్యధిక జనాభా ఉన్న భారత్‌ను అమెజాన్ తమ వ్యాపారానికి కేంద్ర బిందువుగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇందులోభాగంగానే అమెరికా వెలుపల అమెజాన్ తొలి క్యాంపస్‌ని హైదరాబాద్‌లో నిర్మించింది.
నగరంలోని గచ్చిబౌలిలో ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టును చేపట్టారు. 2015లో మొదలైన ఈ క్యాంపస్ నిర్మాణ పనులు ప్రస్తుతం చివరి దశకు చేరుకున్నాయి. తాజాగా, ఈ క్యాంపస్‌కు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో ప్రపంచంలో అతిపెద్ద అమెజాన్ క్యాంపస్ ఎక్కడ ఉంది.? అని హైదారాబాద్ అమెజాన్ క్యాంపస్ ఫోటోను పోస్ట్ చేశాడు. దీనికి ఓ నెటిజన్ అమెజాన్ క్యాంపస్‌కు సంబంధించిన వీడియోను జత చేశాడు.

ఈ వీడియోలో అమెజాన్ ఆవరణతోపాటు క్యాంపస్ లోపల ఉన్న సౌకర్యాలను వివరించారు. 18 లక్షల చదరపు అడుగుల స్థలంలో నిర్వహించిన ఈ భవనంలో 15 వేల మంది విధులు నిర్వర్తించవచ్చు. ఇందులోని క్యాంటీన్‌లో ఒకేసారి ఏకంగా 2700 మంది భోజనం చేయవచ్చు. అంతేగాక, ఇందులో 49 హైస్పీడ్ లిఫ్టులు ఉన్నాయి. ఇక క్యాంపస్‌లోని ప్రతీ ఫ్లోర్‌లో ఇండియన్ కల్చర్ ఉట్టిపడేలా ఆకట్టుకునే థీమ్‌లను తీర్చిదిద్దారు. ప్రస్తుతం అమెజాన్ క్యాంపస్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అమెజాన్ క్యాంపస్ ను చూసిన నెటిజన్లు వావ్ అంటున్నారు.
#Hyderabad
— Akshayy (@AkshayKtrs) January 16, 2022
Amazon's 282-feet tall building can house more than 15,000 employees
This new Amazon campus is its first owned office building pic.twitter.com/OBOPbemUVB
హైదరాబాద్‌లో ఫార్ములా ఈ రేస్
హైదరాబాద్ నగరానికి మరో ఘనత దక్కనుంది. ప్రతిష్టాత్మక "ఫార్ములా ఈ" కార్ రేసింగ్‌కు మహానగరం అతిత్వరలో ఆతిథ్యమివ్వనుంది. దీంతో ఈ ఘనత సాధించిన ప్రపంచ మహానగరాలు న్యూయార్క్, లండన్, బెర్లిన్, రోమ్, సియోల్ వంటి ఎలైట్ క్లబ్ లిస్టులో హైదరాబాద్ కూడా చేరింది. ఈమేరకు "ఫార్ములా ఈ" సంస్థకు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికీ, గ్రీన్ కో అనే సంస్థల మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరగనుంది. అత్యంత పర్యావరణ హితమైన కార్లతో నిర్వహించే ఈ "ఫార్ములా ఈ" రేసింగ్ ను "ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ డి ఆటోమొబైల్" అనే సంస్థ ప్రతి ఏడాది ఒక్కో నగరంలో నిర్వహిస్తుంది.