అంబర్‌పేట ఫ్లైఓవర్‌పై కేటీఆర్ ట్వీట్: మరుసటి రోజే మోడీని ప్రశ్నిస్తూ పిల్లర్లపై పోస్టర్లు
హైదరాబాద్: అంబర్‌పేట్ ఫ్లైఓవర్ నిర్మాణం ఐదేళ్లైనా ఇంకా పూర్తి కాలేదంటూ ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించిన మరుసటి రోజే నగరంలోని ఆ ఫ్లైఓవర్ పిల్లర్లపై ప్రధాని మోడీ పోస్టర్లు వెలువడం కలకలంగా మారాయి. ఈ ఫ్లైఓవర్ ఇంకా ఎన్ని సంవత్సరాలు కడతారు? అంటూ పోస్టర్లలో పేర్కొన్నారు.
2018, మే 5న ఉప్పల్-నారపల్లి ఫ్లైఓవర్ పనులు ప్రారంభమై.. ఇప్పటికీ ఐదేళ్లు పూర్తయినా 40 శాతం పనులు కూడా పూర్తి కాలేదంటూ పోస్టర్లలో పేర్కొన్నారు. ఈ ఫ్లైఓవర్ ఇంకా ఎప్పుడు పూర్తి చేస్తారంటూ మోడీని ప్రశ్నిస్తున్నట్లుగా ఈ పోస్టర్లలో వ్యాఖ్యలు ఉన్నాయి. గతంలో ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనకు వచ్చిన సందర్భంలోనూ హైదరాబాద్‌లో ఆయనకు వ్యతిరేకంగా పలు పోస్టర్లు వెలిసిన విషయం తెలిసిందే.
తాజాగా వెలసిన పోస్టర్లను పలువురు బీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియాలో పంచుకుంటూ కేంద్రంపై విమర్శలు చేస్తున్నారు. మరోవైపు, బీఆర్ఎస్ నేతలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. రాష్ట్ర సర్కారు వ్యవహారం తీరు వల్లే నిర్మాణం ఆలస్యమైందన్నారు. కాగా, అంబర్‌పేట్ ఫ్లైఓవర్ నిర్మాణంపై మంత్రి కేటీఆర్.. సోమవారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఐదేళ్లలో తాము 35 ప్రాజెక్టులు పూర్తి చేశామని, కానీ కేంద్ర ప్రభుత్వం రెండు ఫ్లైఓవర్లను కూడా కట్టలేకపోయిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

అయితే, ఉప్పల్-నారపల్లి మధ్య ఉన్న ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ఆలస్యం కావడానికి కాంట్రాక్టరే కారణమని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. అంతేగాక, పలు చోట్ల జీహెచ్ఎంసీ నుంచి క్లియరెన్స్ రావాల్సి ఉందని, అది రాకపోవడంతోనే పనులు ముందుకు సాగడం లేదని చెబుతున్నాయి.
ఉప్పల్-నారపల్లి ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తికాకపోవడంతో స్థానిక ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నట్లు ఓ నెటిజన్ మంత్రి కేటీఆర్ దృష్టికి సోషల్ మీడియా వేదికగా తీసుకెళ్లారు. అయితే, ఈ ఫ్లైఓవర్ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించడం లేదని.. కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తోందని.. అందుకే ఆలస్యమవుతోందని కేటీఆర్ జవాబిచ్చారు.
'ఉప్పల్, అంబర్‌పేట్ ఫ్లై ఓవర్ల పనులు దురదృష్టవశాత్తూ NHAI ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. జీహెచ్ఎంసీ భూసేకరణ చేసి ఇచ్చినా పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. మేం 35 ప్రాజెక్టులు పూర్తిచేశాం. వారు రెండు ప్రాజెక్టులు పూర్తిచేయలేకపోతున్నారు. అదే కేసీఆర్ ప్రభుత్వానికి, మోడీ ప్రభుత్వానికి ఉన్న తేడా' అని కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
అయితే, కొందరు నెటిజన్లు ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాలని సూచించారు.
ప్రస్తుత కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి.. గతంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా ఉన్నప్పుడు రాసిన లేఖను ఓ నెటిజన్ పోస్టు చేశారు. 'కిషన్ రెడ్డి అంబర్‌పేట్ ఫ్లై ఓవర్ నిర్మాణానికి సంబంధించిన అడ్డంకులను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖ ఇది' అని లేఖను పోస్టు చేశారు.
Lakhs of commuters facing inconvenience between Uppal-Narapally over the years due to the snail pace work of the Central Govt
— Jagan Patimeedi (@JAGANBRS) March 28, 2023
While the TS govt completed more than 35 SRDP projects at a rapid pace, people nailing the incompetence of #Modi govt on the pillars of the ongoing… pic.twitter.com/myreiMpp7Z
జూన్ 2020లో.. రాసిన ఆ లేఖలో అంబర్‌పేట్ ఫ్లై ఓవర్ నేషనల్ హైవే 202లో భాగమని, ఈ రోడ్డును త్వరగా పూర్తి చేసేందుకు అవసరమైన భూసేకరణ కోసం రూ.76 కోట్లను మంజూరు చేసినప్పటికీ.. జీహెచ్ఎంసీ బాధితులకు ఇంతవరకు పరిహారాన్ని అందించకపోవడాన్ని కిషన్ రెడ్డి ప్రస్తావించారు.
బీఆర్ఎస్‌కు ఆత్మీయ మిత్రుడైన, ఒవైసీ సోదరుల నేతృత్వంలోని మజ్లిస్ పార్టీ కారణంగానే ఈ పనులు ఆలస్యం అవుతున్నాయని మరో నెటిజన్ పోస్టు చేశాడు. 'మిస్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ మరో అబద్ధం ఆడారు. జీహెచ్ఎంసీ వైపునుంచే భూసేకరణ పెండింగ్ లో ఉంది (6 నెంబర్ క్రాస్ రోడ్డు మార్గంలో లక్ష్మి అపార్ట్‌మెంట్ ప్రస్తావన). బీఆర్ఎస్ మిత్రుడైన మజ్లిస్ ఈ ప్రాజెక్టుకు ఆటంకాలు కలిగిస్తోంది.
Uppal and Amberpet flyovers are unfortunately being executed by National Highways. Both progressing at snails pace even though GHMC has completed the land acquisition as committed
— KTR (@KTRBRS) March 26, 2023
While we have completed 35 projects they are unable to complete even 2 !!
That’s the Difference… https://t.co/LENfADiqgK
ఈ సమస్యలోని అడ్డంకులు తొలగించాలంటూ కిషన్ రెడ్డి చాలా లేఖలు రాశారు' అని ట్వీట్ లో పేర్కొన్నాడు. మీరు చేసిన తప్పులకు ఇతరులపై నెపం నెట్టొద్దంటూ మరో నెటిజన్ వ్యాఖ్యానించాడు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ ఆలస్యానికి కారణం.. విద్యుత్, వాటర్ లైన్లను ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్, వాటర్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ సరైన సమయంలో షిప్ట్ చేయకపోవడం... అంబర్ పేట్ ఫ్లై ఓవర్ ఆలస్యానికి భూ సేకరణను పూర్తిచేయకపోవడం కారణం. మీరు చేసిన తప్పులకు ఇతరులపై నెపం నెట్టకండి కేటీఆర్ అంటూ ఆ నెటిజన్ వ్యాఖ్యానించాడు.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!












Click it and Unblock the Notifications