ఆ రిజర్వేషన్లు రద్దు చేస్తాం: ఎన్నికల ప్రచారంలో అమిత్ షా కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్: దేశంలో అత్యంత అవినీతి ప్రభుత్వం తెలంగాణలోని బీఆర్ఎస్ సర్కారేనని అన్నారు కేంద్రమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం రాష్ట్రంలో పర్యటిస్తున్న అమిత్ షా ఆర్మూర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. తెలంగాణలో ముస్లింలకు 4 శాతం మతపరమైన రిజర్వేషన్లు ఇచ్చారని.. బీజేపీ ప్రభుత్వం రాగానే ఆ రిజర్వేషన్లు రద్దు చేస్తామన్నారు.
పసుపు రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డు ఏర్పాటు చేస్తోందన్నారు. పసుపు బోర్డ్ ద్వారా రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందని తెలిపారు. పసుపు ఎగుమతులతోపాటు పరిశోధనలు కూడా జరుగుతాయని అమిత్ షా వెల్లడించారు. నిజామాబాద్ బీడీ కార్మికుల కోసం ఆస్పత్రి ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఉత్తర తెలంగాణ నుంచి లక్షలాదిగా గల్ఫ్, విదేశాలకు వలస వెళ్తున్నారన్న అమిత్ షా.. వలస వెళ్లే కార్మికుల కోసం ఎన్నారై మంత్రిత్వ శాఖ కృషి చేస్తోందని తెలిపారు.

ఆర్మూరు బీఆర్ఎస్ నాయకులు బస్ డిపో భూమిని కబ్జా చేశారని అమిత్ షా ఆరోపించారు. బస్సు డిపో భూమి కబ్జా చేసి షాపింగ్ సెంటర్ ఏర్పాటు చేశారని.. ఆ షాపింగ్ సెంటర్ ఏర్పాటు చేసిన నేతకు బీఆర్ఎస్ టికెట్ ఎందుకు ఇచ్చిందని కేంద్రమంత్రి ప్రశ్నించారు. బీఆర్ఎస్ టికెట్ కోసం డీలింగ్ ఉంటుందని ప్రజలు తెలుసుకోవాలని అమిత్ షా అన్నారు.
BJP is committed to fulfilling the aspirations of the people of Telangana. Speaking at the public rally in Armur Assembly.
— Amit Shah (@AmitShah) November 24, 2023
తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు బీజేపీ కట్టుబడి ఉందన్నారు. ఆర్మూరు అసెంబ్లీ బహిరంగ సభలో మాట్లాడారు.#BJP4Telangana https://t.co/SdERxiVhqW
అవినీతి కేసీఆర్ ప్రభుత్వాన్ని సాగనంపాలన్నారు అమిత్ షా. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేపడతామన్నారు. ప్రశ్నపత్రాల లీకేజీ నిందితులను జైలుకు పంపిస్తామన్నారు. బీఆర్ఎస్ సర్కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందని ఆరోపించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎంలు ఒకే తాటి పార్టీలని.. ఈ మూడు పార్టీలు తెలంగాణ ప్రజలను దోచుకోవాలని ప్లా చేస్తున్నాయన్నారు అమిత్ షా. ప్రజలు అప్రమత్తంగా ఉండి బీజేపీకి ఓటేయాలని కోరారు.
Live from the Serilingampally Assembly Constituency roadshow in Telangana.
— Amit Shah (@AmitShah) November 24, 2023
తెలంగాణలోని శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం రోడ్‌షో నుండి ప్రత్యక్ష ప్రసారం.#BJP4Telangana https://t.co/pIHywRGjkj
మరోవైపు, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌లో అమిత్ షా రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో బీజేపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. తెలంగాణ ఓటర్లు బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ఈ సందర్భంగా అమిత్ షా కోరారు. అవినీతి రహిత పాలన కోసం బీజేపీకి ఓటేయాలని ఆయన పిలుపునిచ్చారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications