వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూపీ ఫార్మూలా: ఇక దూకుడే, టిఆర్ఎస్‌కు బిజెపి చెక్ ఇలా...

తెలంగాణలో స్వంతంగా బలాన్ని పెంచుకోనేందుకు బిజెపి ప్రయత్నాలను ప్రారంభించింది. ఈ మేరకు యూపీలో అనుసరించిన ఫార్మూలాను తెలంగాణలో కూడ అనుసరించాలని ఆ పార్టీ భావిస్తోంది.ప్రతి అసెంబ్లీ సె్గ్మెంట్‌కు పూర్తికాల

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్:తెలంగాణలో స్వంతంగా బలాన్ని పెంచుకోనేందుకు బిజెపి ప్రయత్నాలను ప్రారంభించింది. ఈ మేరకు యూపీలో అనుసరించిన ఫార్మూలాను తెలంగాణలో కూడ అనుసరించాలని ఆ పార్టీ భావిస్తోంది.ప్రతి అసెంబ్లీ సె్గ్మెంట్‌కు పూర్తికాలపు కార్యకర్తలను నియమించుకోనున్నారు.టిడిపికి

బిజెపి షాక్: స్వంతంగా బలపడేందుకు యూపీ ఫార్మూలాబిజెపి షాక్: స్వంతంగా బలపడేందుకు యూపీ ఫార్మూలా

తెలంగాణ రాష్ట్రంలో టిడిపి, కాంగ్రెస్‌లు బలహీనపడ్డాయి. ఆ పార్టీల స్థానాన్ని భర్తీ చేయాలని బిజెపి భావిస్తోంది. రాష్ట్రంలో ఉన్న అనుకూల వాతావరణ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోవాలని బిజెపి నాయకులు ప్రయత్నాలను ప్రారంభించారు.

కేంద్రప్రభుత్వం చేపట్టిన పథకాలను ప్రతి ఇంటింటికి తీసుకెళ్ళేందుకు ఆ పార్టీ ప్లాన్ చే్స్తోంది. అంతేకాదు రాజకీయంగా ఇతర పార్టీలనుండి తమ పార్టీలో చేరే నాయకుల జాబితాను కూడ తయారు చేస్తోంది. ఆయా పార్టీలకు చెందిన ముఖ్యనాయకులతో బిజెపి జాతీయనాయకులు టచ్‌లో ఉన్నారని ప్రచారం సాగుతోంది.

వచ్చే ఎన్నికల్లో తాము స్వంతంగా పోటీచేస్తామని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ప్రకటించారు. ఈ రాష్ట్రంలో టిడిపితో పొత్తు ఉండదని ప్రకటించేశారు.

యూపీ ఫార్మూలా అమలు

యూపీ ఫార్మూలా అమలు

రాష్ట్రంలో దూకుడును పెంచాలని జాతీయ నాయకత్వం రాష్ట్ర నాయకత్వానికి ఆదేశాలను ఇచ్చింది. రాష్ట్రప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా గళమెత్తాలని ఆ పార్టీ సూచించింది. అంతేకాదు రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సూచించింది. త్వరలోనే ఇతర పార్టీల నుండి పెద్ద ఎత్తున ముఖ్యనేతలను తమ పార్టీలోకి చేర్చుకొనేందుకు బిజెపి నాయకత్వం చర్యలను చేపట్టింది.అయితే స్వతహగా ఎదిగేందుకు ప్లాన్ చేయాలని జాతీయ నాయకత్వం రాష్ట్ర నాయకత్వానికి సూచించింది. ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో అనుసరించిన ఫార్మూలాను అనుసరించాలని కూడ ఆ పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకొంది. ఈ ఫార్మూలాను అమలు చేయనుంది

Recommended Video

BJP Plans To Check Chandrababu and Jagan
వరంగల్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం కీలకం

వరంగల్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం కీలకం

ఈ నెల 22,23 తేదిల్లో వరంగల్‌లో రెండురోజుల పాటు రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు వరంగల్‌లో జరుగుతాయి. రానున్నరోజుల్లో రాష్ట్రంలో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశాల్లో చర్చించనున్నారు. రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకు, 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు పూర్తికాలపు కార్యకర్తలను నియమించుకోనున్నారు. ఇప్పటికే 74మంది పూర్తికాలపు కార్యకర్తలను నియమించుకొన్నారు.

బూత్ స్థాయి నుండి సమస్యలను గుర్తించడం

బూత్ స్థాయి నుండి సమస్యలను గుర్తించడం

పోలింగ్‌బూత్‌స్థాయి నుండి సమస్యలను గుర్తించడం , వాటి పరిష్కారం కోసం కార్యాచారణను సిద్దం చేయాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. వరంగల్ సమావేశంలో ఈ విషయమై ఓ నిర్ణయాన్ని తీసుకొనే అవకాశాలు లేకపోలేదు. దళితులు, బిసిలకు దగ్గరయ్యేందుకు కార్యక్రమాలను తీసుకోవాలని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది.

ప్రత్యర్థుల బలహీనతలేమిటీ?

ప్రత్యర్థుల బలహీనతలేమిటీ?


రాష్ట్రంలోని ఆయా నియోజకవర్గాల్లో ప్రత్యర్థి పార్టీల బలాలు, బలహీనతల ఆధారంగా ప్లాన్ చేయనున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ప్రత్యర్థి పార్టీలు ఎందుకు బలహీనంగా ఉన్నాయి. లేదా ఎందుకు బలంగా ఉన్నాయి. కారణాలేమిటనే విషయాలపై ఆరా తీస్తోంది. ఏ వ్యూహాన్ని అనుసరిస్తే తమకు అనుకూలంగా ఉంటుందనే విషయాలపై కేంద్రీకరించనుంది.

 తెలంగాణ విమోచన దినోత్సవంపై కార్యక్రమాలు

తెలంగాణ విమోచన దినోత్సవంపై కార్యక్రమాలు

ఉమ్మడి ఆంధ్రప్రదేవ్ రాష్ట్రంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కెసిఆర్ డిమాండ్ చేశారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహణ విషక్ష్ంలో ఆ పార్టీ అనుసరించిన వైఖరిపై విపక్షాలు ఒంటికాలిపై లేస్తున్నాయి. ఇదే అంశాన్ని తీసుకొని టిఆర్ఎస్‌పై పోరాటం చేయాలని బిజెపి భావిస్తోంది.

English summary
Bjp will implement in Telangana Uttar Pradesh formula for strengthening party.central leadership is keen to tap the strong BC vote bank that is rooted in Telangana. Although many of the leaders have already been in TRS, BJP may look into weaning away the second and third rung leaders. Shah is planning to follow the same sort of social engineering which he successfully implemented during UP elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X