వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ గ్రామాల ఎంపికలో బిజెపి వ్యూహమిదే, జానారెడ్డిని దెబ్బకొట్టి, ఎంఐఎం కు చెక్ ఇలా

తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టే దిశగా బిజెపి వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. కాంగ్రెస్, కమ్యూనిష్టు పార్టీలకు గట్టి పట్టున్న నల్గొండ జిల్లాను ఆ పార్టీ ఎంచుకొంది. ఈ జిల్లాలోని మూడు గ్రామాల్లో బిజెప

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టే దిశగా బిజెపి వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. కాంగ్రెస్, కమ్యూనిష్టు పార్టీలకు గట్టి పట్టున్న నల్గొండ జిల్లాను ఆ పార్టీ ఎంచుకొంది. ఈ జిల్లాలోని మూడు గ్రామాల్లో బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటించనున్నారు.

నల్గొండ జిల్లాలోని తేరట్ పల్లి, పెద్దదేవులపల్లి, గుండ్రాంపల్లి గ్రామాల్లో బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటించనున్నారు. ఈ గ్రామాల్లో అమిత్ షా పర్యటనకు పార్టీ నాయకత్వం అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేసింది.

ఈ నెల 22 నుండి మూడు రోజుల పాటు బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. అమిత్ షా తన పర్యటనను నల్గొండ జిల్లా నుండి ప్రారంభించనున్నారు.

అమిత్ షా పర్యటనను పురస్కరించుకొని రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటుచేసుకొనే అవకాశాలున్నాయని బిజెపి నాయకులు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నాయకులతో బిజెపి నాయకులు ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్నారు.అయితే ఇతర పార్టీలను వీడి బిజెపిలోకి చేరే అవకాశాలున్నాయని బిజెపి నాయకులు ప్రకటించారు.

 ఆ మూడు గ్రామాలకు మూడు ప్రత్యేకతలు

ఆ మూడు గ్రామాలకు మూడు ప్రత్యేకతలు

నల్గొండ జిల్లాలోని మూడు గ్రామాల్లో బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటించనున్నారు. ఆయన పర్యటించే గ్రామాలు మూడు ప్రత్యేకతను సంతరించుకొన్నవే.

నిజాం పాలనలో రజాకార్ల అకృత్యాలకు వ్యతిరేకంగా పోరాటం సాగించిన గ్రామంగా గుండ్రాంపల్లి పేరొందింది. గుండ్రాంపల్లి గ్రామంలో సాయుధ పోరాటంలో పాల్గొన్న కమ్యూనిష్టు పార్టీ కార్యకర్తలను రజాకార్లు చంపి ఓ పెద్దబావిలో పూడ్చిపెట్టారు.బిజెపి నాయకుడు మైసయ్య గౌడ్ ను మావోయిస్టులు 1999 లో కాల్చి చంపారు.

ఈ గ్రామంలో మైసయ్య స్మారకస్థూపాన్ని అమిత్ షా ఆవిష్కరించనున్నారు. బీసీలను ఐక్యం చేసిన గ్రామంగా పెద్దదేవులపల్లికి పేరుంది.ఈ గ్రామంలో కూడ అమిత్ షా టూర్ ను ఏర్పాటు చేశారు.

జానారెడ్డికి ఎదురు నిలిచింది పెద్దదేవులపల్లి

జానారెడ్డికి ఎదురు నిలిచింది పెద్దదేవులపల్లి

తెలంగాణ సాయుధపోరాట కాలంలో నల్గొండ జిల్లా త్రిపురారం మండలం పెద్ద దేవులపల్లి గ్రామం కమ్యూనిష్టులకు కంచుకోట.ఆ తర్వాతి కాలంలో ఈ గ్రామం కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా మారింది. ప్రస్తుతం సిఎల్పీ నాయకుడు జానారెడ్డి ప్రాతినిథ్యం గతంలో ప్రాతినిథ్యం వహించే చలకుర్తి నియోజకవర్గం పరిధిలోకి ఈ గ్రామం ఉండేది. అయితే 1994 ఎన్నికల సమయంలో ఈ గ్రామం నుండే జానారెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది.బీసీ అభ్యర్థి రామ్మూర్తి యాదవ్ చలకుర్తి నియోజకవర్గం నుండి టిడిపి అభ్యర్థిగా జానారెడ్డిపై విజయం సాధించారు. నియోజకవర్గంలోని బీసీలు ఏకం కావడానికి ఈ గ్రామం నుండే బీజం పడింది.

ఎంఐఎం ను టార్గెట్ చేసేందుకు

ఎంఐఎం ను టార్గెట్ చేసేందుకు

తెలంగాణ సాయుధ పోరాట సమయంలో నల్గొండ జిల్లాలోని అనేక గ్రామాలు రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం సాగించాయి. చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామంలో రజాకార్లు కమ్యూనిష్టులను ఊచకోత కోసి బావిలో పడేశారు. ఈ ఒక్క గ్రామంలోనే 160 మందిని రజాకార్లు చంపేశారు. ఎంఐఎం ను టార్గెట్ చేసేందుకు బిజెపి ఈ గ్రామాన్ని ఎంచుకొంది. రజాకార్ల పాలనలో ఏ రకంగా ప్రజలు ఇబ్బందులు పడ్డారో బిజెపి వివరించనుంది.1999 మార్చిలో బిజెపి నేత మైసయ్యగౌడ్ ను మావోయిస్టులు కాల్చిచంపారు.మైసయ్య గౌడ్ విగ్రహన్ని ఆయన ఆవిష్కరించనున్నారు.

పెద్దదేవులపల్లిలో అమిత్ షా సహపంక్తి భోజనం

పెద్దదేవులపల్లిలో అమిత్ షా సహపంక్తి భోజనం


బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పెద్దదేవులపల్లిలోని దళితవాడలో సహపంక్తి బోజనం చేయనున్నారు. ఈ గ్రామానికి చెందిన ఇరిగి పాపయ్యతో అమిత్ షా భోజనం చేస్తారు. బిజెపి సానుభూతిపరుడు పాపయ్య. ఆయన భార్య గ్రామపంచాయితీలో స్వీపర్ గా పనిచేస్తారు. రేకుల పైకప్పు గది, వరండా మాత్రమే వారి నివాసం. ఆ ఇంట్లోనే అమిత్ షా భోజనం చేయనున్నారు.

English summary
Bjp national president Amit shah Telangana tour will start from Nalgonda district. Shah tour start on May 22. he will participate Gundrampally, Devulapally, Teretpally villages party programmes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X