వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విమోచనం అంటే భయపడుతున్నారు: నాడు పటేల్ - నేడు మోదీ నిర్ణయం : అమిత్ షా..!!

|
Google Oneindia TeluguNews

నాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ తీసుకున్న నిర్ణయం కారణంగానే రాజకార్ల పాలన నుంచి తెలంగాణకు విముక్తి లభించిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. కేంద్రం నిర్వహించిన విమోచన వేడుకల్లో ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రధాని మోదీ తెలంగాణ విమోచన వేడుకలను అధికారికంగా నిర్వహించాలని ఆదేశించారని చెప్పారు. హైదరాబాద్‌ రాష్ట్రానికి, కర్ణాటక, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలకు సెప్టెంబర్‌ 17న స్వాంతంత్ర్యం వచ్చిందని చెప్పుకొచ్చారు. సర్దార్ పటేల్‌ కృషి వల్ల నిజాం పాలన నుంచి ఈ ప్రాంత ప్రజలు విముక్తి పొందారన్నారు.

నాడు పటేల్ నిర్ణయం కారణంగానే

నాడు పటేల్ నిర్ణయం కారణంగానే

నిజాం, రజాకార్ల ఆగడాలకు ఆపరేషన్‌ పోలో ద్వారా సర్దార్ పటేల్‌ ముగింపు పలికారని షా పేర్కొన్నారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేక పోరాటంలో ఎందరో ప్రాణాలు అర్పించారంటూ వారిని నివాళి అర్పించారు. ఇన్నాళ్లు ఏ ప్రభుత్వం కూడా విమోచన దినోత్సవం నిర్వహించేందుకు సాహసించలేదని ప్రశ్నించారు.

విమోచన దినోత్సవం నిర్వహించేందుకు అన్ని పార్టీలు భయబడ్డాయని వ్యాఖ్యానించారు. నిజం పాలనలో అరాచకాలు కొనసాగాయన్నారు. ప్రజలంతా ఏ భయం లేకుండా వేడులకు చేసుకోవాలని పిలుపునిచ్చారు.

ఇన్నాళ్లు ఓటు బ్యాంకు రాజకీయాలతోనే వేడకలు చేయలేదని విమర్శించారు. ఇప్పటికీ కొందరు వేడుకలు చేయాలంటే భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. ఎంతో మంది తెలంగాణ విముక్తి కోసం పోరాటం చేసి ప్రాణాలు అర్పించారంటూ పేర్లు ప్రస్తావించారు.

ప్రధాని మోదీ ఆదేశాలతోనే వేడుకలు

వారికి నివాళి అర్పించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాధ్ షిండే.. కర్ణాటక మంత్రి శ్రీరాములు నాడు పటేల్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రస్తావించారు. కేంద్రం అధికారికంగా ఈ వేడకలను నిర్వహించాన్ని అభినందించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నాడు 74 ఏళ్ల క్రితం పటేల్ తెలంగాణ గడ్డ పైన జాతీయ పతాకం ఆవిష్కరిస్తే..ఇప్పుడు హోం మంత్రి అమిత్ షా ఆవిష్కరించారని చెప్పుకొచ్చారు.

స్వాతంత్ర్యం వచ్చాక త్రివర్ణపతాకం ఎగరవేస్తుంటే... ఆనాడు నిజాం ప్రభువు అడ్డుకున్నారని కిషన్ రెడ్డి గుర్తు చేసారు.తెలంగాణ గడ్డపై జాతీయ జెండా ఎగరవేసేందుకు ఎందరో ప్రాణాలు అర్పించాంటూ వారి త్యాగాలను స్మరించుకున్నారు. సెప్టెంబర్‌ 17న తెలంగాణలో స్వాంతంత్ర్య వేడుకలను గత ప్రభుత్వాలు జరపలేదని విమర్శించారు.

కేంద్రం అధికారికంగా నిర్వహణ

కేంద్రం అధికారికంగా నిర్వహణ

75 ఏళ్ల తర్వాత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సెప్టెంబర్‌ 17న వేడుకలు నిర్వహిస్తోందని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. అంతకు ముందు అమిత్ షా తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండా ఆవిష్కరించి సైనికుల గౌరవ వందనం స్వీకరించారు.జాతీయ గీతాలాపన అనంతరం అమిత్ షా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.

అమిత్ షా రాక సందర్భంగా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. తెలంగాణ విమోచన వేడుకల్లో సీఐఎస్ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఆర్‌ఏఎఫ్ వంటి మొత్తం 7 కేంద్ర బలగాలు కవాతును నిర్వహిస్తున్నాయి. 12 ట్రూపులు, 1300 మంది కళాకారులతో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇక, ఈ కార్యక్రమం తరువాత పార్టీ సమావేశాలు.. ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాల్లో హోం మంత్రి అమిత్ షా పాల్గొంటున్నారు.

English summary
Home Minister Amit Shah partiicpate in hyderabad liberation day celebrations in Hyderabad. Shah says PM Modi decided to conduct Celebrations officially.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X