• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆమ్నీషియా పబ్ కేసు: వారు ఉన్నత కుటుంబాలవారు కాదని ఘాటుగా స్పందించిన ఆనంద్ మహీంద్రా

|
Google Oneindia TeluguNews

ఆమ్నీషియా పబ్ బాలిక సామూహిక అత్యాచారం ఘటన తెలంగాణ రాష్ట్రంలో దుమారం రేపుతోంది. పబ్ కి వెళ్లిన 17 సంవత్సరాల బాలికను , అక్కడి నుండి బెంజ్ కారులో తీసుకువెళ్లి నలుగురు యువకులు, కారులో సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది. అంతేకాదు హైదరాబాద్లో బాలికపై ఓ రాజకీయ పార్టీ ఎమ్మెల్యే కుమారుడు, కార్పొరేషన్ చైర్మన్ కుమారుడు, హోం మంత్రి మనవడు ఇలా పలుకుబడి ఉన్న కుటుంబాలు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారని వార్తలు వెల్లువగా మారడంతో దీనిపై అందరి దృష్టి ప్రధానంగా నెలకొంది.

అమ్నీషియా పబ్ బాలిక అత్యాచార ఘటనపై ఘాటుగా స్పందించిన ఆనంద్ మహీంద్రా

అమ్నీషియా పబ్ బాలిక అత్యాచార ఘటనపై ఘాటుగా స్పందించిన ఆనంద్ మహీంద్రా

ప్రతిపక్ష పార్టీలు సంచలన ఆరోపణలతో టిఆర్ఎస్ పార్టీ ని టార్గెట్ చేస్తున్నారు. దీంతో ఈ రేప్ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక సంచలనంగా మారిన ఈ ఘటనపై మహీంద్రా గ్రూప్ చైర్ పర్సన్ ఆనంద్ మహీంద్రా ఘాటుగా స్పందించారు. ఇక ఈ ఘటనపై వస్తున్న వార్తలపై స్పందించిన మహీంద్రా గ్రూప్ చైర్ పర్సన్ ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా అత్యాచారానికి పాల్పడిన యువకులను పలుకుబడి ఉన్న కుటుంబాల వారు అని వార్తలు రాయడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు.

ఆ యువకులు ఉన్నత కుటుంబాల వారు కాదంటూ ట్వీట్

ఇక ఈ ఘటన పై ఆసక్తికర ట్వీట్ చేసిన ఆనంద్ మహీంద్రా ఈ యువకులు ఎవరో తనకు తెలియదు కానీ, వారి గురించి రాసిన హెడ్‌లైన్ సరికాదని నేను సూచించవచ్చా? అంటూ పేర్కొన్నారు. ఈ అబ్బాయిలు ' పలుకుబడి' ఉన్నకుటుంబాల నుండి కాదు, డబ్బు ఉన్నప్పటికీ సంస్కృతి, మానవతా విలువలు తెలియని, సరైన పెంపకం లేని 'పేద' కుటుంబాల వారంటూ వ్యాఖ్యానించారు . మైనర్ బాలికకు న్యాయం జరగాలి అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.

కేసులో దర్యాప్తుపై.. పోలీసుల వివరణ ఇదే

ఇదిలా ఉంటే ఈ కేసుకు సంబంధించిన వివరాలను తెలిపిన వెస్ట్ జోన్ డిసిపి జోయల్ డేవిస్ ఈ కేసులో ఇద్దరిని అరెస్టు చేసినట్లుగా వెల్లడించారు. ఇద్దరిలో ఒకరు వక్ఫ్ బోర్డు చైర్మన్ మసి ఉల్లా ఖాన్ కొడుకు ఖాదర్ ఖాన్ కాగా, మరొకరు ఆయన ఫ్రెండ్ హాదీ అని పేర్కొన్నారు. బాలికపై అత్యాచారం మే 28వ తేదీన జరగగా, బాలిక తండ్రి ఫిర్యాదు మే 31 వ తేదీన చేశారని పేర్కొన్నారు. బాలిక చెప్పిన వివరాల ప్రకారం ఆధారాలను క్రాస్ చెక్ చేస్తున్నామని డీసీపీ తెలిపారు. తమ విచారణలో ఐదుగురు నిందితులు ఉన్నట్లు తేలిందని పేర్కొన్న పోలీసులు, నిందితులు ఎవరైనా వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పారు.

హోం మంత్రి టార్గెట్ గా విమర్శలు... ఆయన ఇంటికే వెళ్ళిన రేణుకా చౌదరి అడ్డగింత

హోం మంత్రి టార్గెట్ గా విమర్శలు... ఆయన ఇంటికే వెళ్ళిన రేణుకా చౌదరి అడ్డగింత

ఇదిలా ఉంటే తెలంగాణాలో మైనర్ బాలికపై అత్యాచార ఘటనలో అధికార టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తున్నారు ప్రతిపక్ష పార్టీల నాయకులు. ముఖ్యంగా హోం మంత్రి టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక మైనర్ బాలికపై అత్యాచార ఘటనను ఖండిస్తూ హోం మంత్రిని కలిసేందుకు కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ఆయన నివాసానికి వెళ్లారు.

కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరిని పోలీసులు అడ్డుకోవడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనర్ బాలికను పబ్ లోకి అనుమతించిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఈ విధంగా దారుణాలు జరుగుతుంటే హోం మంత్రి, ముఖ్యమంత్రి నిద్రపోతున్నారు అంటూ రేణుక జ్యోతి ఆగ్రహం వ్యక్తం చేశారు.

English summary
Amnesia pub girl gang rape incident takes political turn and opposition targets Home Minister. mahindra group chairman Anand Mahindra reacted strongly to the incident by saying that they were not from higher class families.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X