వివాదంలో ఆమ్రపాలి కాటా.. పారిశుధ్య కార్మికుల నిరసన సెగ!!
జిహెచ్ఎంసి కమిషనర్ గా ఆమ్రపాలి కాటా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే. జీహెచ్ ఎంసీలో పారిశుధ్యానికి పెద్ద పీట వేస్తున్నామని చెప్పే ప్రయత్నంలో ఉన్న ఆమ్రపాలి తరచూ ఆకస్మిక తనిఖీలతో అధికారులను, సిబ్బందిని హడలెత్తిస్తున్నారు. అయినప్పటికీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పారిశుధ్యంపై ప్రజల నుండి అసంతృప్తి వ్యక్తం అవుతూనే ఉంది.
పారిశుధ్య కార్మికులపై ఆమ్రపాలి షాకింగ్ వ్యాఖ్యలు
అయితే తాజాగా జిహెచ్ఎంసి కార్మికుల పైన ఆమ్రపాలి కాట వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జిహెచ్ఎంసి పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు సరిగ్గా పనిచేయడం లేదని, ఇంటింటి చెత్త సేకరణలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అప్పుడప్పుడు స్వయంగా మా ఇంట్లో కూడా చెప్పిన సేకరించడం లేదంటూ ఆమ్రపాలి కాటా షాకింగ్ కామెంట్స్ చేశారు.

జీహెచ్ ఎంసీ కమీషనర్ పై పారిశుధ్య కార్మికులు ఆగ్రహం
రోజు చెత్త ఆటో వస్తుందో లేదో తెలుసుకోవడానికి ఆధునిక పద్ధతులు ఉపయోగించాల్సిన అవసరం ఉందని చెబుతున్న క్రమంలో ఆమ్రపాలి కాటా ఈ వ్యాఖ్యలు చేశారు. తన ఇంట్లో చెత్త కూడా సేకరించకుంటే ఒక్కోసారి తమకు కూడా ఇబ్బంది అవుతుందని ఆమె వ్యాఖ్యలు చేశారు. దీంతో కమిషనర్ చేసిన షాకింగ్ వ్యాఖ్యల పైన పారిశుద్ధ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
జీహెచ్ఎంసీ ముట్టడి
గ్రేటర్ హైదరాబాద్ ఇంత శుభ్రంగా ఉంది అంటే పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తేనే అని వారు తేల్చి చెబుతున్నారు. కమిషనర్ చేసిన వ్యాఖ్యలపైన వారు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే ఈరోజు జిహెచ్ఎంసి కార్యాలయాన్ని పారిశుద్ధ్య కార్మికులు ముట్టడించారు. తన ఇంట్లోని చెత్తను కూడా సేకరించడం కోసం పారిశుద్ధ కార్మికులు రావడం లేదని ఆమె చేసిన వ్యాఖ్యల పైన నిరసన తెలిపారు.
కార్మికులతో మాట్లాడిన ఆమ్రపాలి.. వ్యాఖ్యలపై వివరణ
జిహెచ్ఎంసి కార్యాలయాన్ని ముట్టడించి నిరసన వ్యక్తం చేసిన కార్మికుల వద్దకు వెళ్లిన ఆమ్రపాలి కాట వారితో మాట్లాడారు. తాను వారిని కించపరిచే ఉద్దేశంతో వ్యాఖ్యలు చేయలేదని ఆమె అన్నారు అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమ్రపాలి. కార్మికులను కించపరిచే ఉద్దేశం తనకు ఏమాత్రం లేదని స్పష్టం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో కార్మికులు కీలక పాత్ర పోషిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఇక ఆందోళన చేస్తున్న కార్మికులతో చర్చలు అనంతరం కార్మికులు తమ ఆందోళనను విరమించారు.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications