అతని వల్లే బయటకు రాలేపోతున్నా..ప్రణయ్‌ హత్య కేసు తీర్పుపై అమృత తొలి రియాక్షన్

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ పరువు హత్య కేసులో సోమవారం కోర్టు కీలక తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. నిందితుల్లో ఒకరికి ఉరిశిక్ష, మిగిలిన వారికి జీవిత ఖైదు విధించింది.2018లో తెలుగు రాష్ట్రాల్లో ప్రణయ్ హత్య కేసు సంచలనం సృష్టించింది.అమృతను కులాంతర వివాహం చేసుకున్నాడనే కారణంతో ఆమె తండ్రి మారుతీరావు, సుపారీ గ్యాంగ్‌తో కలిసి ప్రణయ్‌ను హత్య చేయించాడు.

5 నెలల గర్భవతిగా ఉన్న అమృతతో కలిసి ఆసుపత్రి నుంచి బయటకు వస్తుండగా, సుభాష్ శర్మ, అతన్ని కత్తితో నరికి చంపాడు.ఈ హత్య అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ కేసులో 2019లో 8 మందిపై ఛార్జిషీట్ నమోదు చేయగా.. వారిలో మారుతీరావు ఆత్మహత్య చేసుకొని మరణించాడు. మిగతా ఏడుగురిలో ఒకరికి ఉరిశిక్ష, మరో ఆరుగురికి యావజ్జీవ శిక్ష విధిస్తూ నల్గొండ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్ట్ సోమవారం సంచలన తీర్పు వెల్లడించింది. తాజాగా కోర్టు ఇచ్చిన తీర్పుపై అమృత స్పందించారు.

Amrutha first reaction to the court verdict in the Pranay murder case

సోషల్ మీడియా వేదికగా ఆమె తన స్పందనను తెలియజేశారు. "ఇన్నేళ్ల నిరీక్షణ తర్వాత న్యాయం జరిగింది. నా హృదయం భావోద్వేగాలతో నిండిపోయింది. ఈ తీర్పుతో పరువు పేరిట జరిగే దారుణాలు, నేరాలు, దౌర్జన్యాలు తగ్గుతాయని ఆశిస్తున్నాను" అని అమృత తెలిపారు.ఈ ప్రయాణంలో తనకు అండగా నిలిచిన పోలీసులు, న్యాయశాఖ, ప్రభుత్వాలకు, సన్నిహితులకు, మీడియాకు కృతజ్ఞతలు తెలియజేశారు. బాబు భవిష్యత్తును తన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మీడియా ముందుకు రాలేకపోతున్నానని ఓ నోట్ విడుదల చేసింది.ఈ తీర్పుతోనైనా పరువు హత్యలు ఆగుతాయని ఆశిస్తున్నానని తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+