Telangana: రాజస్థాన్‌లో రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఆర్మీ జవాన్ మృతి..
రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఆర్మీ జవాన్ రాజస్థాన్ లో ప్రమాదానికి గురై చనిపోయాడు. సెంట్రల్ ఇండస్ట్రీస్ సెక్యూరిటీ ఫోర్స్‌లో ఉద్యోగం చేస్తున్న శివకుమార్ ప్రమాదావశాత్తు మరణించాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండలం జగ్గారావుపల్లికిచెందిన చాడా శివకుమార్ సీఐఎస్ఎఫ్ లో ఉద్యోగం సాధించాడు. డ్యూటీలో భాగంగా రాజస్థాన్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు.
ఈ క్రమంలోనే అతను బాత్ రూమ్ లో జారి పడడ్డాడు. తీవ్ర గాయలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. తలకు గాయాలు కావడంతో కోమాలోకి వెళ్లాడు. ఆ తర్వాత పరిస్థితి విషమించి శివకుమార్ మృతి చెందినట్లు అక్కడి అధికారులు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సమాచారమిచ్చారు. దీంతో శివకుమార్ సొంత గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

శివకుమార్ ఇటీవల తెలంగాణలో నిర్వహించిన కానిస్టేబుల్ పరీక్ష రాసి ఉద్యోగం పొందాడు. ఇక్కడ ఇంకా శిక్షణ ప్రారంభించకపోవడంతో రాజస్థాన్ లోనే విధుల్లో కొనసాగుతోన్నాడు. త్వరలోనే ఉద్యోగానికి రాజీనామా చేసి సొంతూరుకు వద్దామని నిర్ణయించుకున్నాడు. కానీ ఇలోపే శివకుమార్ ను మృత్యువు కబలించింది.
శివకుమార్ ప్రస్తుతం రాజస్థాన్ లోని డిలోలి 16 వ బెటాలియన్ లో డాక్యుమెంటరీ సెక్యూరిటీ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. రెండు నెలల క్రితం బతుకమ్మ పండుగ సందర్భంగా స్వగ్రామానికి వచ్చిన శివకుమార్ తిరిగి వెళ్లాడు. శివకుమార్ అన్న గంగారెడ్డి సిరిసిల్లలో ఏఆర్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు.












Click it and Unblock the Notifications