డీకే అరుణ ఇంట్లోకి అర్ధరాత్రి ఆగంతకుడి ప్రవేశం!
తమ కుటుంబానికి భద్రత పెంచాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు భారతీయ జనతా పార్టీ ఎంపీ డీకే అరుణ. శనివారం అర్ధరాత్రి తర్వాత ఆమె నివాసంలోకి ఓ ఆగంతకుడు ప్రవేశించడమే ఇందుకు కారణం. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని రోడ్ నెంబర్ 56లో డీకే అరుణ నివాసం ఉంటున్నారు.
ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో దుండగుడు చేతులకు గ్లౌజ్‌లు ధరించి డీకే అరుణ ఇంట్లోకి చొరబడ్డాడు. దాదాపు గంటన్నరపాటు ఆమె ఇంట్లో తిరిగినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయింది. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబందించిన వివరాలను డీకే అరుణ కారు డ్రైవర్ లక్ష్మణ్ వెల్లడించారు.

శనివారం తెల్లవారుజామున 3 గంటలకు ఇంట్లో శబ్ధం వచ్చిందని.. కానీ, ఎవరు కనిపించలేదని తెలిపారు. కిచెన్‌లో పాదముద్రలు ఉన్నాయన్నారు. సీసీటీవీ ఫుటేజీ చూడగా.. ఓ వ్యక్తి వంగతగి వైపు కిటికీలోంచి వచ్చినట్లు కనిపించింది. మాస్క్, గ్లౌజ్‌లు వేసుకుని ఉన్నాడు. ఆ సమయంలో డీకే అరుణ ఇంట్లో లేరు. మీటింగ్ కోసం శనివారం మహబూబ్‌నగర్ వెళ్లారని డ్రైవర్ చెప్పారు.
ఆగంతకుడు గంటన్నరపాటు కిచెన్‌లో ఉన్నాడని, ఎంపీ గది వరకు వెళ్లాడని డ్రైవర్ చెప్పారు. అయితే, ఇంట్లో ఎలాంటి వస్తువులు పోలేదని తెలిపారు. ఒక్కడే వచ్చినట్లు సీసీ టీవీలో కనిపించిందన్నారు. జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశామని డీకే అరుణ డ్రైవర్ లక్ష్మణ్ తెలిపారు.
Last night, an intruder entered my home in Hyderabad, causing deep concern for my family's safety. Despite living in a high-security area near the CM, the breach raises serious questions. The intruder spent over an hour inside without stealing anything, leaving me anxious about… pic.twitter.com/7gHpDTPuEK
— D K Aruna (@Aruna_DK) March 16, 2025
హైదరాబాద్‌లోని తమ నివాసంలో దుండగుడు చొరబడి ఘటనపై ఎంపీ డీకే అరుణ ఆందోళన వ్యక్తం చేశారు. తనతోపాటు తన కుటుంబానికి సెక్యూరిటీ పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఘటనపై విచారణ చేపట్టాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. గతంలో తమ కుటుంబంపై జరిగిన ఘటనను దృష్టిలో ఉంచుకుని భద్రత పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి 100 మీటర్ల దూరంలోని తన నివాసంలో ఇలా జరిగిందన్నారు. దుండుగుడు తన నివాసంలో ఏవైనా బగ్స్ పెట్టారా? అనే అనుమానం వ్యక్తం చేశారు.
డీకే అరుణకు బండి సంజయ్ ఫోన్, ఘటనపై ఆరా
డీకే అరుణకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఫోన్ చేశారు. దుండగుడు ఆమె ఇంట్లోకి ప్రవేశించిన ఘటనపై ఆరా తీశారు. ఘటనపై కేసు నమోదు చేయాలని పోలీసులు, అధికారులను బండి సంజయ్ ఆదేశించారు. డీకే అరుణ కుటుంబానికి భద్రత పెంచాలని సూచించారు.
-
ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ద్రోణి.. రైతన్నలూ అలెర్ట్! -
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
మందు బాబులకు బిగ్ షాక్.. 2 రోజులు వైన్స్ బంద్.. -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్!












Click it and Unblock the Notifications