సినిమాల్లో ఆఫర్ పేరుతో యువతుల ట్రాప్; ఆపై వ్యభిచారం; ఓ అసిస్టెంట్ డైరెక్టర్ దందా!!
సినిమాల్లో ఆఫర్ పేరుతో యువతులను ట్రాప్ చేసి వారితో వ్యభిచారం చేయిస్తున్న ప్రముఖ దర్శకుడి వద్ద పని చేస్తున్న ఓ అసిస్టెంట్ డైరెక్టర్ ను పోలీసులు పట్టుకున్నారు.
సినిమాలలో అవకాశం కోసం ఎంతో మంది యువతులు రకరకాల మార్గాలలో ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒక్క అవకాశం వస్తే చాలు తామేమిటో నిరూపించుకుంటామంటూ సినిమా ఇండస్ట్రీ బాట పడుతున్న వారు ఎందరో. అటువంటి వారికి సినిమాలలో బ్రహ్మాండమైన ఆఫర్లు ఇప్పిస్తామని నమ్మబలికి, వారిని ట్రాప్ చేసి, వారితో వ్యభిచారం చేయిస్తున్న ఒక ప్రముఖ డైరెక్టర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న వ్యక్తి చేస్తున్న గలీజ్ దందా గుట్టు రట్టు చేశారు పోలీసులు.

సినిమాలలో ఆఫర్ ఇస్తానని వల
ఎన్నో ఆశలతో సినిమా పరిశ్రమలోకి అడుగుపెడుతున్న అమ్మాయిల జీవితాన్ని అవకాశం ఇప్పిస్తానని ఆశ చూపి, వ్యభిచార రొంపిలోకి దింపుతున్నాడు ఒక ప్రముఖ డైరెక్టర్ కు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న సురేష్ బోయిన. ముంబై, ఢిల్లీ, వెస్ట్ బెంగాల్ నుంచి అమ్మాయిలను ఇక్కడికి పిలిపించి వారితో వ్యభిచార దందా నిర్వహిస్తున్నాడు. తాను చెప్పిన పని చేస్తే మంచి సినిమాలలో ఆఫర్ ఇప్పిస్తానని యువతులను నమ్మబలుకుతున్నాడు.

ప్రముఖులకు అమ్మాయిలను సరఫరా చేస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్
అమ్మాయిల ఫోటోలు ఆన్లైన్ లో పెట్టి హైదరాబాద్లోని ప్రముఖులకు యువతులను సరఫరా చేస్తున్నాడు. ఇక వారితో ప్రముఖులతో ఉంటే మంచి సినిమా అవకాశాలు వారి ఇప్పిస్తారని నమ్మ పలుకుతున్నాడు. పెద్దల కళ్ళలో పడితే హీరోయిన్ అయిపోవచ్చని చెప్తున్నారు. ఈ పని చేస్తే సినిమాలలో సెటిల్ అవ్వవచ్చని, భారీ అవకాశాలు వస్తాయని కెరీర్ మలుపు తిరుగుతుందని మాయమాటలు చెబుతున్నాడు.

హైదరాబాద్, గోవా, బెంగళూరులలో వ్యభిచార దందా , పట్టుకున్న పోలీసులు
ఒక హైదరాబాద్లో మాత్రమే కాకుండా గోవా, బెంగళూరులో కూడా సురేష్ బోయిన వ్యభిచార దందా నిర్వహిస్తున్నాడు. సినిమాల మీద పిచ్చితో రంగుల లోకం మీద వ్యామోహంతో ఇండస్ట్రీలోకి వచ్చే వారి జీవితాలను నాశనం చేస్తున్నాడు. అయితే సురేష్ బోయిన చేస్తున్న దందాపై ఉప్పందుకున్న పోలీసులు అతను చేస్తున్న చీకటి వ్యాపారం గురించి తెలుసుకొని సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించారు. సాక్షాలతో పాటు రెడ్ హ్యాండెడ్ గా అతనిని పట్టుకున్నారు. అతనితోపాటుగా మేకల అఖిల్ కుమార్ అనే వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

వ్యభిచార దందా వెనుక ఎవరి హస్తం.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ఇక వీరి చెర సినిమా అవకాశాల కోసం వచ్చినట్టు చెప్తున్న చాలా మంది యువతులను తప్పించారు. అయితే ఈ వ్యభిచార దందా వెనుక సురేష్ తోపాటు ఇంకా ఎవరెవరు ఉన్నారు అన్నదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీని వెనుక సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన మరెవరైనా పెద్ద తలకాయల హస్తం ఉందా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు .












Click it and Unblock the Notifications