హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రోహిత్ ఆత్మహత్య: హెచ్‌సియు వీసీకి ప్రపంచవ్యాప్తంగా 130 విద్యావేత్తల లేఖ

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పరిశోధక విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 130 మంది విద్యావేత్తలు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సులర్‌కు బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో న్యాయం కోసం డిమాండ్ చేశారు.

రోహిత్ మృతి నేపథ్యంలో అతని కుటుంబానికి అండగా ఉండాలని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇప్పుడు అన్యాయం జరిగిందని, భవిష్యత్తులో ఇలా జరగకుండా చూడాలన్నారు. భారత్ విశ్వవిద్యాలయాల్లో రాజకీయ నాయకుల జోక్యం, కుల వివక్షలను వారు ఎత్తి చూపారు.

Photos: దత్తాత్రేయ ఇంటి ముట్టడి

An open letter to Vice Chancellor of University of Hyderabad

హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో వివక్ష లేకుండా చూడాలని కోరారు. విశ్వవిద్యాలయాల్లో రాజకీయ జోక్యం ఉండకుండా చూడాలని కోరారు. అందరు విద్యార్థులకు సరైన విద్యాబోధన చేయాలని సూచించారు. చివరగా.. మేమంతా చూస్తూనే ఉన్నామని పేర్కొన్నారు.

ఈ లేఖ రాసిన వారిలో... రూపా విశ్వనాథ్, ప్రొఫెసర్ ఆఫ్ ఇండియన్ రిలీజియన్స్ (యునివర్సిటీ ఆఫ్ గొటింగెన్, జెర్మనీ), జో లీ, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఆంథ్రోపాలజీ (విలియమ్స్ కాలేజ్, యూఎస్ఏ), చంద్ర మల్లంపల్లి, ప్రొఫెసర్ ఆఫ్ హిస్టరీ (వెస్ట్ మౌంట్ కాలేజీ, యూఎస్ఏ) తదితర 130 మంది బహిరంగ లేఖ రాశారు.

English summary
An open letter to Vice Chancellor of University of Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X