కాంగ్రెస్ Vs బీఆర్ఎస్, అధికారం ఎవరిది - పబ్లిక్ పల్స్ క్లియర్..!!

తెలంగాణలో గెలుపెవరిది. ఇప్పుడు ఇదే అంశం రాజకీయంగా ఉత్కంఠ పెంచుతోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ కు అనుకూల వాతావరణం కనిపిస్తోంది. మౌత్ పబ్లిసిటీ ప్రకారం కాంగ్రెస్ అధికారం ఖాయమనే అభిప్రాయం కలుగుతోంది. ఇదే సమయంలో బీఆర్ఎస్ సైతం ధీమా వ్యక్తం చేస్తోంది. బీఆర్ఎస్ పాలనలో వ్యతిరేకమైన వర్గాలను దగ్గర చేసుకోవటంలో కాంగ్రెస్ సక్సెస్ అయినట్లు కనిపిస్తోంది. ఈ రెండు పార్టీలపైన పబ్లిక్ పల్స్ ఎలా ఉంది.

హోరా హోరీ పోరు : తెలంగాణలో బీఆర్ఎస్ నెగటివ్ సమస్య ఎదుర్కొంటున్నట్లు స్పష్టం అవుతోంది. ఉద్యోగాల విషయంలో యువత బీఆర్ఎస్ నాయకత్వం పైన ఆగ్రహంగా ఉన్నారు. అంతేగాక సీఎం కేసీఆర్‌ వ్యవహార శైలిపై కొంత అసంతృప్తి ఏర్పడింది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై మరికొంత వ్యతిరేకత ఉంది. పదేళ్లు ఈ పాలన చూసాం..కాంగ్రెస్ కు ఈ సారి అవకాశం ఇద్దామనే చర్చ క్షేత్ర స్థాయిలో జరుగుతోంది. కేసీఆర్‌ తమకు గతంలో వచ్చిన సీట్లకన్నా నాలుగైదు ఎక్కువే వస్తాయని చెబుతున్నా, వాస్తవ పరిస్థితి అంత సులువుగా లేదనే చెప్పాలి. గత రెండు ఎన్నికల్లో లేనంతటి గట్టి పోటీని బీఆర్‌ఎస్‌ ఎదుర్కొంటోంది. తెలంగాణలో క్షేత్ర స్థాయి పరిస్థితులు చూసిన తరువాత కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నా..చివరి వరకు పోటీ ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Analysits Predict Close BRS And Congress Fight in Telangana Elections, Who will be the Winner

కాంగ్రెస్ వేవ్ ఉందా : బీఆర్ఎస్ బలంగా ఉండే గ్రామీణ ప్రాంతంలోనూ పరిస్థితి భిన్నంగా ఉందనే రిపోర్టులు ఉణ్నాయి. ముస్లింలు గతసారి బీఆర్‌ఎస్‌ వైపు పూర్తిగా మొగ్గుచూపారు. ఇప్పుడు వారు ఎలా ఉంటారన్న దానిపై భిన్నాభిప్రాయాలున్నాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ కాంగ్రెస్ కు 80 సీట్లు ఖాయమని చెబుతున్నారు. రాహుల్, ప్రియాంక సుడిగాలి పర్యటన చేస్తూ గ్యారంటీల అమలు పైన హామీ ఇస్తున్నారు. ఈ సారి ఎన్నికల్లో 30 నియోజకవర్గాల చుట్టూ మూడు పార్టీలు తిరుగుతున్నాయి. అక్కడే అధికారం డిసైడ్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి. బీజేపీ ఏ స్థాయిలో ఓట్లు చీల్చుతుందనేది ఇక్కడ కీలకం కానుందది. ఈ మూడు పార్టీల తో పాటుగా ఫార్వర్డ్‌ బ్లాక్‌, స్వతంత్ర అభ్యర్ధులుగా గానీ మరి కొన్ని చోట్ల ప్రధాన పార్టీలకు పోటీ ఇస్తున్నారు. వీళ్లు కూడా ఏ స్థాయిలో ఓట్లు దక్కించుకుంటారనేది మరో ప్రధాన అంశం.

Analysits Predict Close BRS And Congress Fight in Telangana Elections, Who will be the Winner

మెజార్టీపై ధీమా : 119 సీట్లలో ఆరేడు సీట్లలో ఎంఐఎం గెలుస్తుంటుంది. మిగిలిన 112 సీట్లలో ఈ రకంగా 30 నుంచి 40 సీట్లలో తేడా వస్తే మిగిలిన సుమారు 70 నుంచి 80 సీట్లలోనే కాంగ్రెస్‌ తన ప్రభావం చూపగలుగుతుంది. ఏ పార్టీ అయితే వేవ్‌ సృష్టించుకోగలుగుతుందో దానికి పూర్తి మెజార్టీ రావొచ్చు. కానీ అలా జరుగుతుందా అన్నది సస్పెన్స్‌గానే ఉంది. తెలంగాణలో వేవ్ వస్తే తప్ప ఇప్పటి వరకు ఏ పార్టీ చరిత్రలో పూర్తి స్థాయి సీట్లు దక్కించుకోలేదు. కానీ, ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ వేవ్ కొనసాగుతుందనే ప్రచారం బలంగా సాగుతోంది. అదే జరిగితే కాంగ్రెస్ 70 సీట్లు ఖాయమనే ప్రచారం ఉంది. దీంతో..తెలంగాణ ప్రజలు ఎవరికి పట్టం కడతారనేది ఈ నెల 30న పోలింగ్..డిసెంబర్ 3న కౌంటింట్ లో తేలే వరకు వేచి చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+