శిక్ష తప్పదా, అడ్డంగా దొరికిన యాంకర్ ప్రదీప్‌కు షాక్ తప్పదా? కేసు నమోదు

Posted By:
Subscribe to Oneindia Telugu
  డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు : యాంకర్ ప్రదీప్‌కు శిక్ష తప్పదా ?

  హైదరాబాద్: జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 45లో డిసెంబర్ 31 అర్ధరాత్రి పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో పట్టుబడిన యాంకర్ ప్రదీప్‌కు శిక్ష పడే అవకాశాలున్నాయా? అనే చర్చ సాగుతోంది. రాత్రి మూడు గంటల సమయంలో అతిగా మద్యం సేవించి కారు నడుపుకుండూ వస్తుండగా పోలీసులు ఆపారు.

  న్యూఇయర్: కార్లన్నీ ఖరీదైనవే, పోలీసులను వేడుకున్న యాంకర్ ప్రదీప్, ఏం జరిగిందంటే?

  బ్రీత్ అనలైజర్‌తో తనిఖీలు చేయగా మోతాదుకు మించి మద్యం సేవించినట్లు తేలింది. దీంతో పోలీసులు ఆయన కారును స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కారును జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ తరలించారు.

  న్యూఇయర్, అమ్మాయిలు రావాలంటూ హాస్టల్ వద్ద ఆకతాయిల వీరంగం, వీడియో తీశారు

   జైలు శిక్ష తప్పదా

  జైలు శిక్ష తప్పదా

  ప్రదీప్‌కు మంగళవారం తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చి కోర్టులో ప్రవేశ పెట్టనున్నారు. సాధారణంగా మందు తాగి డ్రైవింగ్ చేసే వారికి 35 పాయింట్లు దాటితే శిక్షతో పాటు వాహనం సీజ్ చేస్తారు. ప్రదీప్ రీడింగ్ 178 పాయింట్లు. ట్రాఫిక్ నిబంధనల ప్రకారం ప్రదీప్‌కు శిక్ష తప్పదని అంటున్నారు. అతనికి మూడు నుంచి అయిదు రోజుల వరకు జైలు శిక్ష తప్పేలా లేదని అంటున్నారు.

   మద్యం చిత్తుగా తాగి

  మద్యం చిత్తుగా తాగి

  న్యూఇయర్ వేడుకల కోసం యువత చిత్తుగా మద్యం తాగి, రోడ్డుపై ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించే వారిని కూడా మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో పోలీసులు ఆదివారం రాత్రి నుంచి సోమవారం వేకువజాము వరకు హైదరాబాదులోని పలు ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. వేలాదిమంది దొరికిపోయారు. అందులో ప్రదీప్ కూడా ఒకరు.

  ఢిల్లీలోను భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

  ఢిల్లీలోను భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

  దేశ రాజధాని న్యూఢిల్లీలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా వేల సంఖ్యలో డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. అర్ధరాత్రి 12 గంటల కంటే ముందు 745 మంది డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడినట్లు ఢిల్లీ పోలీసు స్పెషల్ పీఆర్‌వో దీపేంద్ర పఠాక్ తెలిపారు. పన్నెండు గంటల తర్వాత 1007 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. మొత్తంగా 1,752 కేసులు నమోదయ్యాయి. 90 శాతం మంది యువత నిబంధనలు ఉల్లంఘించారన్నారు.

   బెంగళూరులో వేధింపులు కేసులు నమోదు కాలేదు

  బెంగళూరులో వేధింపులు కేసులు నమోదు కాలేదు

  బెంగళూరులో 1300 మంది ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారని బెంగళూరు పోలీసు కమిషనర్ సునీల్ కుమార్ తెలిపారు. వేధింపుల కేసులు నమోదు కాలేదన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులున మోదు చేసినట్లు కమిషనర్ వెల్లడించారు. అయితే ఆ తర్వాత ఉదయానికి వేధింపుల కేసులు వెలుగు చూశాయి.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  'Telugu anchor Pradeep Machiraju and other scoundrels caught last night for drunk driving will go to jail.' Tweeted one twitterity.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి