పోలీసుల విచారణకు యాంకర్ విష్ణు ప్రియ డుమ్మా ..కేసులోకి అతను సడన్‌ ఎంట్రీ

బెట్టింగ్స్ యాప్స్ వ్యవహారం తెలంగాణలో సంచలనం సృష్టిస్తోంది.బెట్టింగ్ యాప్స్ కారణంగా అనేక మంది అమాయకులు తమ ప్రాణాలు కోల్పోతున్నారు. దీని వల్ల యువత పూర్తిగా తప్పుదోవ పడుతున్నారు. ఈజీ మనీకి అలవాటు పడి నేరాలకు పాల్పడుతున్నారు. దీంతో తెలంగాణ పోలీసులు ఈ బెట్టింగ్స్ యాప్స్‌పై ప్రత్యేక దృష్టిని సారించారు. దీనిలో భాగంగానే బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు, యూట్యూబర్లు, సెలబ్రిటీలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న 11 మంది తెలుగు సెలబ్రిటీలపై కేసులు నమోదు చేయడం జరిగింది.

హర్షసాయి, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్‌ ఖాన్‌, టెస్టీ తేజ, కిరణ్‌ గౌడ్‌, విష్ణుప్రియ, యాంకర్‌ శ్యామల, రీతూ చౌదరి, బండారు షేషయాని సుప్రిత తదితరులపై పంజాగుట్ట పోలీసులు కేసులు నమోదు చేశారు.దీనిలో భాగంగానే పంజాగుట్టు పోలీసులు యాంకర్ విష్ణు ప్రియకు నోటీసులు జారీ చేశారు. విష్ణు ప్రియతో పాటు బిగ్‌బాస్ నటుడు టేస్టీ తేజకు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈరోజు (మంగళవారం) సాయంత్రం 4 గంటలకు విచారణకు హాజరుకావాలని నోటీస్సుల్లో స్పష్టం చేశారు.

Anchor Vishnu Priya fails to appear before police for questioning

అయితే విచారణకు విష్ణు ప్రియ,టేస్టీ తేజ ఇద్దరూ పోలీసుల విచారణకు డుమ్మా కొట్టారు.వాళ్లిద్దరి తరఫున పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు RJ శేఖర్ భాషా వెళ్లారు. విష్ణు ప్రియ,టేస్టీ తేజ మరో మూడో రోజుల్లో పోలీసుల విచారణకు హాజరుకానున్నట్టు శేఖర్ భాష తెలిపారు.దీనికి పోలీసులు సైతం అంగీకరించినట్టు ఆయన వెల్లడించారు. మీడియాకు భయపడి వాళ్లిద్దరూ విచారణకు రాలేదని అతడు వివరించాడు. పోలీసులు ఇచ్చిన గడువులోగా కచ్చితంగా వచ్చి విచారణకు హాజరవుతారని శేఖర్ భాషా హామీ ఇచ్చాడు. మరోవైపు మంచు లక్ష్మీకి సైతం పోలీసులు నోటీసులు ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. యోలో 247 అనే బెట్టింగ్ యాప్‌ని ప్రమోట్ చేశారనే కారణంగా ఆమెకు పోలీసులు నోటీసులు జారీ చేశారని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+