వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెనడాలో తొలి తెలుగు మహిళా మంత్రి: హిందువులు, సిక్కుల కోసం చొరవ

By Srinivas
|
Google Oneindia TeluguNews

టోరంటో: కెనడాలోని అతి పెద్ద ప్రావిన్సు అయిన ఒంటారియోకు మంత్రిగా పని చేస్తున్న తెలుగు యువతి దీపిక దామెర్ల ప్రవాస భారతీయుల అవసరాల పైన ప్రత్యేకంగా దృష్టి సారించారు.

మిస్సిసాగా నగరంలో నివసిస్తున్న హిందువులు, సిక్కులు సహా ప్రవాస భారతీయుల కోసం ప్రత్యేకంగా శ్మశాన వాటిక, అంత్యక్రియల ప్రాంతాలను కేటాయించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

సికింద్రాబాదులో జన్మించిన దీపిక... ఉత్తర అమెరికాలో మంత్రి పదవి చేపట్టిన తొలి తెలుగు మహిళ కావడం గమనార్హం. దీపిక తండ్రి ఆర్మీలో సేవలు అందించారు. దీపిక డిగ్రీ పూర్తి చేశాక 1991లో కెనెడా వెళ్లారు. రోట్‌మ్యాన్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో ఎంబియే పూర్తి చేశారు.

Andhra born woman minister Dipika Damerla blazes a trail in Canada

తర్వాత అక్కడి రెండు ప్రముఖ బ్యాంకుల్లో పని చేశారు. టీవీ జర్నలిస్ట్‌గాను పని చేశారు. 2007లో రాజకీయాల్లో చేరారు. లేబర్ పార్టీ తరఫున పోటీ చేసి 2014 ఎన్నికల్లో గెలిచి ఆరోగ్య, దీర్ఘకాల సంరక్షణ సహాయ మంత్రిగా విధులు నిర్వహిస్తున్నారు.

దీపిక మాట్లాడుతూ... హిందువులు, సిక్కులు, ఇతర వర్గాలకు స్మశాన వాటికలు ఏర్పాటు చేసే విషయమై అధికారులతో మాట్లాడుతున్నానని చెప్పారు. కెనడాలో భారత్ జనాభా క్రమంగా పెరుగుతోందన్నారు. భారత్ బయట మంత్రి పదవి చేపట్టిన తొలి మహిళను తానే కావొచ్చన్నారు.

English summary
Andhra-born Dipika Damerla, who is the first Indian-origin woman minister in Canada's biggest province of Ontario, is blazing a trail in community service.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X