మోడీ పథకం: మహేష్ బాబు శ్రీమంతుడు చూడనున్న కెసిఆర్, బాబు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులు త్వరలో మహేష్ బాబు హీరోగా వచ్చిన శ్రీమంతుడు సినిమా చూసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొద్ది రోజుల క్రితం రూరల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాంను ప్రారంభించారు. ప్రముఖులు తమ తమ గ్రామాలను దత్తత తీసుకోవాలని, వాటిని సాధ్యమైనంత అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చారు. మోడీ పిలుపు మేరకు పలువురు ప్రముఖులు తమ తమ గ్రామాలను దత్తత తీసుకున్నారు.
ప్రధాని మోడీ పథకానికి సంబంధించిన సందేశం మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు సినిమాలో ఉంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు శ్రీమంతుడు సినిమాను చూసే అవకాశాలున్నాయని చెబుతున్నారు.

తెలంగాణ ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు త్వరలో ఈ సినిమాను చూడనున్నారని తెలుస్తోంది. ఆ సినిమాను కెటిఆర్ చూసి బాగుందని చెప్పాక.. కెసిఆర్ కూడా చేడనున్నారని తెలుస్తోంది. అలాగే, చంద్రబాబు వచ్చే వారంలో శ్రీమంతుడు సినిమాను చూడవచ్చునని చెబుతున్నారు.
అదే సమయంలో ప్రధాని నరేంద్ర మోడీకి ఈ సినిమాను చూపించాలని సినిమాకు సంబంధించిన వారు ఉత్సుకత చూపిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. మోడీ కోసం ప్రత్యేక షోను వేసే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications