మరింత పటిష్టంగా అంగన్ వాడీ విద్య.!డ్రాపవుట్స్ లేని విద్యావిధానానికి మంత్రుల కసరత్తు.!
హైదరాబాద్ : రాష్ట్రంలో అంగన్ వాడీ విద్యను పటిష్టం చేయడం ద్వారా పాఠశాల విద్యను బలోపేతం చేసే లక్ష్యంతో ప్రాథమిక పాఠశాలల్లో అంగన్ వాడీ కేంద్రాలను నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు రాష్ట్ర మంత్రులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి, శ్రీమతి సత్యవతి రాథోడ్ లు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ విద్య లేని లోటును గమనించిన రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు విద్యార్థులకు పౌష్టికాహారంతో పాటు నర్సరీ విద్య కూడా అందించాలని ఉద్దేశ్యంతో అంగన్ వాడీ కేంద్రాలను పటిష్టం చేస్తున్నారు. ఇందులో భాగంగా అంగన్ వాడీ కేంద్రాలను ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో నిర్వహించడం వల్ల నర్సరీ నుంచి నేరుగా ప్రాథమిక విద్యకు విద్యార్థులను సంసిద్ధం చేయడం ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రులు.

ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ విద్య.. ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలన్న అధికారులు.
అంగన్ వాడీ కేంద్రాలు, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల సంయుక్త నిర్వహణపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరెక్టరేట్ లో రెండు శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అంగన్ వాడీ కేంద్రాలు అంటే కేవలం పౌష్టికాహారం అందించడానికే పరిమితం కాదని, అంగన్ వాడీ కేంద్రాల్లో నర్సరీ, ఎల్.కే.జి, యు.కే.జీ విద్య అందించడంతో పాటు పిల్లలను ప్రాథమిక విద్య కొనసాగించడానికి ముందునుంచే పాఠశాలలకు పరిచయం చేయాలని, తద్వారా మధ్యలో బడి మానేయడాన్ని కట్టడి చేయాలని ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రులు తెలిపారు.

పాఠశాల్లో కోవిడ్ జాగ్రత్తలు.. అందుకే ప్రభుత్వ విద్యా సంస్ధలకు పెరుగుతున్న ఆధరణ..
ఇందులో భాగంగా రాష్ట్రంలో ఉన్న 35,700 అంగన్ వాడీ కేంద్రాలలో ఇప్పటికే 15,167 అంగన్వాడీ కేంద్రాలు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో నడుస్తున్నాయని తెలిపారు. 11,185 అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు ఉండగా, 12,174 కేంద్రాలు కిరాయి లేకుండా ఇతర భవనాలల్లో నడుస్తున్నాయని, మరో 12,219 కేంద్రాలు కిరాయి భవనాల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొదటగా కిరాయి భవనాల్లో నడుస్తున్న ఈ అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో నిర్వహించాలని, త్వరలోనే దీనిపై స్పెషల్ డ్రైవ్ చేపడుతామని చెప్పారు.

నర్సరీ నుంచే అలవాటు.. పాఠశాలలకు పిల్లలను నిర్బయంగా పంపాలన్న మంత్రులు
జిల్లా విద్యాశాఖ అధికారులు, జిల్లా సంక్షేమ అధికారులు సంయుక్తంగా తీసుకున్న నిర్ణయం మేరకు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో అంగన్వాడీ కేంద్రాలను నిర్వహిస్తామన్నారు. ఇందులో స్థానిక ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని అధికారులకు సూచించారు. కోవిడ్ కారణంగా ప్రభుత్వ విద్య పట్ల తల్లిదండ్రులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని, దీనిని గమనించి ప్రభుత్వ విద్యను పటిష్టం చేయడం కోసం అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో నిర్వహించడం వల్ల పిల్లలకు పాఠశాలలు పరిచయం అవుతాయని, స్కూల్ భయం పోతుందని, మధ్యలో బడి మానేయడం ఆగుతుందని చెప్పారు.

ప్రాథమిక పాఠశాలల్లో విద్యాబోధన.. అంగన్వాడీల నిర్వహణపై త్వరలో స్పెషల్ డ్రైవ్
అనంతరం సేవ్ ద చిల్డ్రన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో స్టేట్ హోమ్ లోని పిల్లలకు మంత్రులు ఇద్దరు కలిసి స్టేషనరీ వస్తువులు కలిగిన బ్యాగులు అందించారు. విద్యార్థులకు చేయుత అందించేందుకు వచ్చిన స్వచ్ఛంద సంస్థ నిర్వహకులను అభినందించారు. ఈ సమీక్ష సమావేశంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి, కమిషనర్ శ్రీమతి దివ్య దేవరాజన్, విధ్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ సందీప్ సుల్తానియా, కమిషనర్ శ్రీమతి దేవసేన, ఇతర డైరెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications