• search
  • Live TV
వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

మురళి హత్యతో పొలిటికల్ వార్: ప్రతీకార దాడుల ప్రమాదంతో అప్రమత్తం

|

వరంగల్‌ : ఇన్నాళ్లూ ప్రశాంతంగా ఉన్న నగరం కార్పొరేటర్‌ అనిశెట్టి మురళి హత్యతో ఉలికిపడింది. 25 ఏళ్ల పగను చల్లార్చుకునేందుకు మురళిని హత్యచేసిన తీరును తెలుసుకొని నగరప్రజలు భయకంపితుయ్యారు. దీనికి ప్రతిగా రానున్న రోజుల్లో మురళి అనుచరులు, సహచరుల్లో ఎవరైనా ప్రతీకార దాడులకు దిగే అవకాశాలు ఉన్నాయా ? అనే కోణంలోనూ పోలీసు సమాచారం సేకరిస్తున్నారు.

కార్పొరేటర్‌ అనిశెట్టిమురళి హత్యకు ప్రతిగా నగరంలో ఆయన అనుచయి ఎలాంటి ఘటనకు పాల్పడకుండా పోలీసు బందోబస్తు పెంచారు. మురళికి అత్యంత సన్నిహితులు ఉండే ఇళ్ల వద్ద పోలీసు నిఘా ఉంచారు. ఉన్నతాధికారు ఆదేశా మేరకు నగరంలో ఎలాంటి ఘటను జరుగకుండా జాగ్రత్తపడాని సూచించడంతో స్పెషల్‌ పార్టీ పోలీసులు మఫ్టీలో కాపు కాస్తున్నారు.

అంతేకాకుండా మురళిని హత్య చేసిన బొమ్మతి విక్రమ్‌, చిరంజీవి, వరుణ్‌బాబు ఉంటున్న ఇళ్ల వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు. మరోవైపు మురళి హత్య కేసు రిమాండ్‌ రిపోర్టులో ఏ4, ఏ5, ఏ6గా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్‌ కానుగంటి శేఖర్‌, మరో నాయకుడు శ్రీమాన్‌ను అరెస్టు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగాయి.

ఆందోళనకు సిద్ధమవుతున్న కాంగ్రెస్‌

మురళి హత్యకు కారకులు ఎవరైనా కఠిన చర్యలు తీసుకుంటామంటూ అంతిమ యాంత్ర సందర్భంగా అధికార టీఆర్‌ఎస్‌ నాయకులు చెప్పారు. వీరి ప్రకటనకు అనుగుణంగానే అధికార పార్టీ నేత హత్య, ప్రతిపక్ష పార్టీనేత పాత్ర అన్నట్లుగా రాజకీయ వేడి రాజుకుంటోంది. అందుకు కొనసాగింపుగానే కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్‌ కానుగంటి శేఖర్‌, మరో నాయకుడు శ్రీమాన్‌ పేర్లు రిమాండ్‌ రిపోర్ట్‌లో దర్శనమిచ్చాయి. వారి అరెస్టుకు ప్రత్యేక పోలీసు టీరు సైతం రంగంలోకి దిగాయి.

Anisetti Murali's murder takes political turn

కాంగ్రెస్‌ నేతలు మాత్రం టీఆర్‌ఎస్‌ హత్యా రాజకీయాతో ప్రతిపక్షాల గొంతు నులుముతోందని అంటున్నారు. తమ పార్టీ నేత పేర్లు రిమాండ్‌ రిపోర్టులో ఉండటంతో కాంగ్రెస్‌ సైతం దూకుడుగా వ్యవహరించాని నిర్ణయించినట్లు కనిపిస్తోంది. ఇందుకు నిరసనగా ఈ నె 18న అంబేద్కర్‌ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టాలని నిర్ణయించారు.

గత రెండు దశాబ్దాలో....

రెండు దశాబ్దా క్రితం వరంగల్‌ నగరంలో గల్లీకొక దాదా తమదైన సామ్రాజ్యాన్ని నడిపించేవారు. దాడులు, ప్రతిదాడులతో ఆధిపత్యాన్ని చాటుకునేప్రయత్నం చేసేవారు. వీరికి రాజకీయ నాయకు అండదండలు ఉండేవి. కాలక్రమంలో నక్సలైట్ల రంగ ప్రవేశం... సదరు రైడీలను టార్గెట్‌ చేసి బహిరంగంగానే కాల్చి చంపిన సంఘటలు ఉన్నాయి. దాదాలు వర్సెస్‌ నక్సలైట్ల ఫైట్‌ కాస్త క్రమంగా రూపుమార్చుకుని, పోలీసు వర్సెస్‌ నక్సలైట్ల పోరుగా మారింది. రైల్వేస్టేషన్ల, పోలీస్‌స్టేషన్ల సమీపంలోనే పోలీసును నక్సలైట్లు కాల్చిచంపారు. నగరంనడిబొడ్డున ఎన్‌కౌంటర్ల పరంపర సాగింది.

ఆ ముగ్గురి కోసం పోలీసు వేట

టీఆర్‌ఎస్‌ 44వ డివిజన్‌ కార్పొరేటర్‌ అనిశెట్టి మురళి హత్య కేసులో మరో ముగ్గురి కోసం వరంగల్‌ కమిషనరేట్‌ పోలీసు వేట సాగిస్తున్నారు. వరంగల్‌తోపాటు వివిధ జిల్లాల్లో ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చేపడుతున్నాయి. వరంగల్‌ పోలీసు కమిషనర్‌ జి. సుధీర్‌బాబు ఆదేశాల మేరకు డీసీపీ, ఏసీపీలు, సిఐలు మూడు బృందాుగా ఏర్పడి హైదరాబాద్‌, ఆదిలాబాద్, మంచిర్యా, జయశంకర్‌ భూపాపల్లి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో వెతకడం ప్రారంభించారు.

మురళి హత్య కేసులో ముగ్గురు ప్రధాన నిందితులను అరెస్టు చేయగా మరో ముగ్గరు ఏ4 నాయిని రాజేందర్‌రెడ్డి, ఏ5 పోతు శ్రీమాన్‌, ఏ6 కానుగంటి శేఖర్‌ ఉన్నారు. తమ పేర్లు రిమాండ్‌ రిపోర్టులో ఉన్నట్లు బయటకు పొక్కగానే వారు ముగ్గురు అజ్ఞాతంలోకి వెళఙ్లనట్లు సమాచారం.

తెరాసపై కారాలు మిరియాలు....

టీఆర్‌ఎస్‌ నేతలు ప్రతిపక్షాలతో ఉన్న వైరుధ్యాన్ని రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకుంటున్నారని కాంగ్రెస్‌ నాయకులు విమర్శించారు. అరాచక రాజకీయతత్వాన్ని హత్యా రాజకీయాలుగా మారుస్తూ అక్రమ కేసులు నమోదు చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. కార్పొరేటర్‌ మురళీమనోహర్‌ హత్యతో ఏ మాత్రం సంబంధంలేని జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డిని కావానే ఏ4 నిందితుడిగా ఇరికించారన్నారు. ఈ మేరకు పోలీసుపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు.'

హన్మకొండలోని జిల్లా కాంగ్రెస్‌ కార్యాయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి విజయరామారావు, డీసీసీబీ చైర్మన్‌ జంగా రాఘవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి విజయరామారావు మాట్లాడుతూ ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ పార్టీ ఉనికిని దెబ్బతీయానే దురుద్దేశంతోనే కార్పొరేటర్‌ మురళీ హత్యను టీఆర్‌ఎస్‌ పావుగా వాడుకుందని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ హత్యారాజకీయాలకు ప్పాడుతోందన్నారు. తమ మాట వినని ప్రతిపక్ష నేతలను, అధికారులను, ప్రజలను భయభ్రాంతుకు గురిచేస్తున్నారని అన్నారు.

కాంగ్రెస్‌ నేతల రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక అక్రమ కేసులకు ప్పాడుతున్నారని ఆయన తెలిపారు. మురళి హత్యతో ఎలాంటి సంబంధంలేదని, నాయిని రాజేందర్‌రెడ్డిని ఏ4 నిందితుడిగా చేర్చడం కుట్రలో భాగమని విజయరామారవు అన్నారు.

Anisetti Murali's murder takes political turn

మురళి హత్య అనంతరం నిందితుడిగా ఉన్న బి. విక్రమ్‌ స్వయంగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడని, తన తండ్రి జెన్నీ (జనార్ధన్‌) హత్య కేసులో మురళి ప్రధాన నిందితుడైన విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు. మురళి హత్య విషయంలో ఇంత స్పష్టత ఉన్నా రాజేందర్‌రెడ్డిని నిందితుడిగా చేర్చడం టీఆర్‌ఎస్‌ హత్యారాజకీయాకు నిదర్శనమని ఆయన ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ నేతు పోతు శ్రీమాన్‌, కానుగంటి శేఖర్‌కు సైతం ఈ హత్యతో ఏమాత్రం సంబంధంలేదని విజయరామారవు పునరుద్ఘాటించారు.

కడియం, ఎర్రబెల్లితే కుట్ర...

కార్పొరేటర్‌ మురళి హత్య కేసులో నాయినికి సంబంధాన్ని అంటగట్టడంతో డిప్యూటీ సీఎం కడియంశ్రీహరి, ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావులే కుట్ర పన్నారని డీసీసీబీ చైర్మన్‌ జంగారాఘవరెడ్డి ఆరోపించారు. ఒక హత్యను ఇంకొకరికి ఆపాదించడం దయాకర్‌రావకు అలవాటేనని జంగా అన్నారు. ఇలా ఓ హత్య కేసును కొండా మురళిపై మోపడంతో వారు విరోధులయ్యారని అన్నారు.

మురళి హత్యకు దారితీసిన పరిస్థితులు, అనంతరం పరిణామాలు, నిందితుల లొంగబాటు వంటివి అందరికీ తెలిసినవేనన్నారు. దీనితో రాజేందర్ రెడ్డికి ఏం సంబంధమని ప్రశ్నించారు. నాయిని కుమారుడు విశాల్‌రెడ్డి 2015 నవంబర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడని, అయితే మురళి హత్య కేసు రిమాండ్‌ రిపోర్టులో విక్రమ్‌ డిసెంబర్‌లో నాయినిని కలిసి హత్యకు కుట్ర పన్నారని చెప్పారని, ఇది ఎలా సాధ్యమని జంగా ప్రశ్నించారు.

ఇన్నాళ్లూ ప్రశాంతంగా ఉన్న నగరం కార్పొరేటర్‌ అనిశెట్టి మురళి హత్యతో ఉలికిపడింది.
ఎవరైనా ప్రతీకార దాడులకు దిగే అవకాశాలు ఉన్నాయా ? అనే కోణంలోనూ పోలీసు సమాచారం సేకరిస్తున్నారు.
మురళికి అత్యంత సన్నిహితులు ఉండే ఇళ్ల వద్ద పోలీసు నిఘా ఉంచారు.

English summary
Anisetti Murali's murder takes political turn
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X