సికింద్రాబాద్ నుండి బయలుదేరిన భారత్ గౌరవ్ రైలు దివ్య దక్షిణ యాత్ర!!
భారత్ గౌరవ్ రైళ్ళు.. భారతీయ రైల్వే అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన టూరిస్ట్ రైళ్లు. ఈ రైళ్లలో చేపట్టే ప్రయాణాలు టూర్ ప్యాకేజీ ల రూపంలో అందించబడతాయి. వీటిలో రైలు ప్రయాణంతో పాటుగా, వెళ్లిన టూరిస్ట్ ప్రదేశంలో బస్సుల ద్వారా విహారయాత్రలు, హోటళ్లలో బస చేయడం, టూరిస్ట్ ప్రదేశాలకు సంబంధించిన గైడింగ్, టూరిస్టులకు భోజన వసతి, ప్రయాణ బీమా మొదలైన అన్ని సేవలు సౌకర్యవంతమైన రైలు సేవలతో పాటు అందించబడతాయి.
రైలు ప్రయాణంతో పాటుగా అనుబంధంగా ఆన్ బోర్డ్ సేవలను కూడా ఈ ప్యాకేజీల ద్వారా అందిస్తారు. దేశంలోని పుణ్యక్షేత్రాలను, ముఖ్యమైన చారిత్రక, సాంస్కృతిక ప్రదేశాలను దర్శించడానికి ఈ రైలు ద్వారా అవకాశం కలుగుతుంది. ఇప్పటికే భారత్ గౌరవ్ రైళ్ళు సాగరవంగా భారతదేశంలోని వివిధ పర్యాటక ప్రదేశాలను కలుపుతూ నడుస్తున్నాయి.

ఈ క్రమంలోనే దివ్య దక్షిణ యాత్ర కోసం దక్షిణ మధ్య రైల్వే తాజాగా భారత్ గౌరవ్ రైలును మరోమారు యాత్రికులతో పంపించింది. జ్యోతిర్లింగాలు సహా దివ్య దక్షిణ యాత్ర కోసం దక్షిణ మధ్య రైల్వే తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం నిర్వహించిన భారత్ గౌరవ్ రైలు అత్యంత ప్రజాదరణ పొందింది. దీంతో మరో విడత భారత్ గౌరవ్ రైలు దివ్య దక్షిణ యాత్ర కోసం ఈ రోజు 700 మంది యాత్రికులతో సికింద్రాబాద్ నుంచి బయలుదేరి వెళ్ళింది.
తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో ముఖ్యమైన తీర్ధ క్షేత్రాలను సందర్శిస్తూ మొత్తం 8 రోజులు, 9 రాత్రులు సాగే ఈ యాత్రలో ప్రయాణీకులు కాజీపేట్, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట వద్ద రైలు ఎక్కవచ్చు. ఈ ప్రాంతాల వారందరికీ ఈ రైలు ద్వారా దక్షిణ తీర్ధయాత్ర చేసేందుకు అద్భుత అవకాశం కలిగిస్తుంది.
మొత్తం 8 రోజులు, 9 రాత్రులతో కూడిన ఈ యాత్రలో ప్రయాణం, ఆహార విహారాలు, బస ఏర్పాట్లన్నీ నిర్వహకులే చేస్తారు. తిరువణ్ణామలై, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, త్రివేండ్రం, తిరుచ్చి, తంజావూరు క్షేత్రాలను ఈ యాత్రలో సందర్శించి అక్కడ విశేషాలను తెలుసుకునే వీలుంటుంది.












Click it and Unblock the Notifications