బీఆర్ఎస్ ఎమ్మెల్యే వికెట్ నంబర్ 9: అరికెపూడి అవుట్..
Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. తన దూకుడును కొనసాగిస్తోంది. ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితిని ఖాళీ చేసే పనిలో పడింది. ఇప్పటికే పలువురు శాసన సభ, శాసన మండలి సభ్యులు బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పారు. మాజీ ఎంపీలు సైతం అదే బాట పట్టారు.
మొన్నటికి మొన్న.. ఆరు మంది ఎమ్మెల్సీలు బీఆర్ఎస్‌ను వీడారు. దండె విఠల్, భానుప్రసాద్ రావు, ఎంఎస్ ప్రభాకర్, బొగ్గారపు దయానంద్, ఎగ్గే మల్లేశం, బస్వరాజు సారయ్య.. కాంగ్రెస్‌లో చేరారు. ఈ విషయంలో అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడాలు కూడా చూడట్లేదు. రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకుని అర్ధరాత్రి హైదరాబాద్‌కు రాగా ఆయన సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

ఇప్పటివరకు మొత్తం ఎనిమిదిమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. కడియం శ్రీహరి- స్టేషన్ ఘన్‌పూర్, దానం నాగేందర్- ఖైరతాబాద్, తెల్లం వెంకట్రావ్- భద్రాచలం, పోచారం శ్రీనివాసరెడ్డి- బాన్సువాడ, డాక్టర్ ఎం సంజయ్ కుమార్- జగిత్యాల, కాలె యాదయ్య- చేవెళ్ల, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి- గద్వాల, టీ ప్రకాష్ గౌడ్- రాజేంద్రనగర్ కాంగ్రెస్‌లోకి వరుస కట్టారు.
తాజాగా బీఆర్ఎస్‌కే చెందిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కూడా .. ఈ జాబితాలో చేరారు. పార్టీ ఫిరాయించారు. రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. పట్నం మహేందర్ రెడ్డితో కలిసి కొద్దిసేపటి కిందటే రేవంత్ రెడ్డిని కలిశారు. ఆయన చేతుల మీదుగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
కాంగ్రెస్ లోకి శేరిలింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ#ArikepudiGandhi #RevanthReddy #CMRevanthReddy #Congress #BRS #Serilingampalle #Oneindiatelugu pic.twitter.com/gxR9DVW1Cs
— oneindiatelugu (@oneindiatelugu) July 13, 2024
గత ఏడాది నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి విజయం సాధించారు అరికపూడి. 2014- 2018 ఎన్నికల్లో ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఇదే నియోజకవర్గం నుంచీ గెలిచారు. ఆ తరువాత పార్టీ ఫిరాయించారు. బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. 2018, 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ గుర్తు మీద విజయం సాధించారు. ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరారు.












Click it and Unblock the Notifications