రమ్య తరహా మరో ప్రమాదం: ఔటర్లో ఢీకొట్టిన కారు, అమ్మాయి బ్రెయిన్ డెడ్

హైదరాబాద్: భాగ్యనగరంలో రమ్య తరహా ప్రమాదం మరొకటి జరిగింది. పెద్ద అంబర్ పేట వద్ద ఔటర్ రింగు రోడ్డులో బస్సు కోసం తల్లీకూతుళ్లు నిరీక్షిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. కారును ర్యాష్‌గా డ్రైవింగ్ చేస్తూ వారిని గుద్దారు.

దీంతో అమ్మాయి బ్రెయిన్ డెడ్ అయింది. బాధితురాలైన అమ్మాయి పేరు సంజన. ఆమె తల్లి శ్రీదేవి. వీరు బస్సు కోసం ఔటర్ రింగు రోడ్డులో నిలబడగా.. కారు వచ్చి గుద్దింది. దీంతో సంజన బ్రెయిన్ డెడ్ అయింది. శ్రీదేవి పరిస్థితి విషమంగా ఉంది. నిందితులు కారును వదిలేసి పరారయ్యారు. కారులో మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

చిన్నారి సంజనకు తీవ్ర గాయాలు అయ్యాయని, పక్క టెముకలు విరిగిపోయాయని వైద్యులు చెప్పారని సంజన (4) నాయనమ్మ చెప్పారు. క్షతగాత్రులను 108 వాహనంలో సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించినట్లు చెప్పారు. సంజన కామినేనిలో చికిత్స పొందుతోంది.

Another girl brain dead in ORR accident

ఎయిర్ పోర్టులో బుల్లెట్ల కలకలం

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం ఉదయం ఓ ప్రయాణీకుడి వద్ద బుల్లెట్లు కనిపించాయి. దీంతో కలకలం రేగింది. లక్నో వెళ్లాల్సిన ప్రయాణికుడి లగేజీని తనిఖీ చేయగా మూడు బుల్లెట్లు బయటపడ్డాయి. సిబ్బంది అతనిని పోలీసులకు అప్పగించారు. పోలీసులు విచారిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+