రాలిన మరో విద్యార్థిని: చదవుల ఒత్తిడి తాళలేక బలవన్మరణం..
ఖమ్మం జిల్లా సింగరేణి మండలం చీమలపాడులో పదో తరగతి విద్యార్థిని రంగు సౌజన్య(15) ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
ఖమ్మం: చదువుల ఒత్తిడితో రాలిపోతున్న విద్యార్థుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఇటీవలి కాలంలో తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ ఘటనలు ఎక్కువగా నమోదవుతున్నాయి. గడిచిన 15రోజుల్లో దాదాపు 8మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు.

తాజాగా ఖమ్మం జిల్లా సింగరేణి మండలం చీమలపాడులో పదో తరగతి విద్యార్థిని రంగు సౌజన్య(15) ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. శుక్రవారం కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో సౌజన్య ఆత్మహత్యకు పాల్పడింది. పాఠశాలలో ఒత్తిడి వల్లే సౌజన్య బలవన్మరణానికి పాల్పడిందని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications