చక్రి భార్యకు ఝలక్!: రోజుకో మలుపు తిరుగుతున్న ఆస్తుల వివాదం
హైదరాబాద్: ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి ఆస్తుల వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. చక్రి సోదరుడు మహిత్ నారాయణకు మద్దతుగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వద్ద శుక్రవారం నాడు వికలాంగుల హక్కుల పోరాట సమితి ప్రతినిధులు ఆందోళన చేపట్టారు.
గురువారం రాత్రి చక్రి సోదరుడు మహిత్ అరెస్టుకు నిరసనగా వారు.. పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. ఇంట్లో అద్దెకుంటున్న వారిని ఖాళీ చేయించి చక్రి సోదరుడికి అప్పగించాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు.
కాగా, చక్రి కుటుంబ సభ్యులు.. తల్లి, సోదరుడు నాలుగు రోజులుగా సోమాజిగూడలోని విల్లా వద్దనే బైఠాయించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వారు నిన్న మాట్లాడుతూ... తాము కోర్టు తీర్పు మేరకు నడుచుకుంటామని చెప్పారు. అన్నీ ఆస్తులు తన కోడలు పేరుమీదే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆమె లక్షలు, కోట్లు తీసుకు వెళ్లిపోయిందన్నారు. మాకు ఇక్కడ ఏం లేకుండా పోయిందన్నారు. ఇంత దుర్మార్గం ఏ కోడలు చేయదని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఎన్ని రోజులైనా ఇక్కడే కూర్చుంటామని, చచ్చేదాకా ఉంటామన్నారు. తనకు ఇప్పుడు పెన్షనే ఆధారమని చెప్పారు.
ఆస్తులు అన్నీ తన కోడలు పేరు మీదే ఉన్నాయని చెప్పారు. చక్రి సోదరుడు మాట్లాడుతూ.. కోట్లాది రూపాయల ఆస్తి ఉందని చెప్పారు. అన్నయ్య చనిపోయాక.. ఏం సంపాదించలేదని చెప్పారని కాని చాలా ఆస్తి ఉందని చెప్పారు. తమకు కనీసం ఉండేందుకు ఇల్లు కూడా లేదని చెప్పారు.
అందుకోసమే తన తల్లి పోరాడుతోందన్నారు. మొయినాబాదులో, సోమాజిగూడలో, శామీర్ పేటలో, శంషాబాదులో ప్లాట్లు, ఇళ్లు ఉన్నాయని చెప్పారు. గుంటూరులో అయిదెకరాల పొలం ఉందని చెప్పారు. తిరుపతిలో ఉన్న ప్లాట్‌ను అమ్మేసుకున్నారని, ఓ ఆడి కారు ఉందని చెప్పారు. ఇదిలా ఉండగా, ఆయనను గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది.
-
నయా రికార్డ్ సాధించిన తెలుగింటి కోడలు.. ఫస్ట్ ఇండియన్ సెలబ్రిటీ !! -
Don’t Sleep: తెలుగులో తొలి సైకలాజికల్ గ్రిప్పింగ్ థ్రిల్లర్- ఫస్ట్ లుక్ -
అడవి శేష్ 'డెకాయిట్' మూవీ సెన్సార్ టాక్ ఇదే..! -
ప్రభాస్ ఫౌజీ లీక్డ్ ఫోటో! 1940ల బ్యాక్‌డ్రాప్‌లో విధ్వంసం -
నా భర్త 9 మందితో.. సంచలన విషయాలు బయట పెట్టిన తెలుగు హీరోయిన్..! -
టాలీవుడ్ రారాజు "రెబల్ స్టార్" ఆస్తి ఎంతో తెలిస్తే కళ్లు తిరగడం పక్కా !! -
ఫేమ్ కోసం ఇంత దారుణమా? ఎవర్ని వదిలేది లేదు! -
అన్నదమ్ముల డబుల్ బొనాంజా.. మొన్న సంతోష్.. ఇప్పుడు సంగీత్ !! -
టాలీవుడ్ యంగ్ హీరో పెళ్లి డేట్ ఫిక్స్.. అందరిలాగా కాకుండా కొత్తగా !! -
విడాకులు తీసుకుంటున్న శర్వానంద్?.. సోషల్ మీడియాలో పెళ్లి ఫొటోలు డిలిట్ -
అడల్ట్ సైట్లలో మార్ఫింగ్ ఫోటోలు! స్టార్ నటి ఆవేదన! -
రణ్‌బీర్ - సాయి పల్లవి "రామాయణ" టీజర్లో ఈ తప్పులను గమనించారా?












Click it and Unblock the Notifications