చీప్ లిక్కర్‌: ఏకమైన విపక్షాలు, గజ్వేల్‌ నుంచే వ్యతిరేక ఉద్యమం

హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లోని కళింగ భవన్‌లో చీప్ లిక్కర్ వ్యతిరేక ఉద్యమం అఖిలపక్షం సమావేశం శనివారం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న చీల్ లిక్కర్ అంశంపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ చీప్ లిక్కర్ పాలసీతో సీఎం కేసీఆర్‌ ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు.

చీప్ లిక్కర్‌ పాలసీపై అఖిలపక్షం అభిప్రాయాన్ని తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. చీల్ లిక్కర్ ప్రవేశపెట్టడం సమాజానికి మంచిది కాదన్న ఆయన దీనిపై ఎలాంటి పోరాటానికైనా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. గజ్వేల్‌ నుంచి చీప్‌ లిక్కర్‌ వ్యతిరేక ఉద్యమం ప్రారంభం టీటీడీపీ నేత ఎర్రబెల్లిదయాకర్‌రావు తెలిపారు.

రాష్ట్రంలో ఆదాయ వనరుల కోసం చీప్ లిక్కర్ అవసరం లేదన్నారు. చీప్ లిక్కర్ ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆయన తెలిపారు. తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ శాసనసభపక్ష నేత లక్ష్మణ్ మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చీప్ లిక్కరే తమ ప్రధాన ఏజెండా అన్నారు.

 Anti-Cheap Liquor Body To Launch Major Movement

నగరంలోని కళింగ భవన్‌లో జరిగిన ఈ సమావేశానికి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీటీడీపీ నేత ఎర్రబెల్లిదయాకర్‌రావు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, రాజయ్యలు హాజరయ్యారు. ఈ సందర్భంగా చీప్‌ లిక్కర్‌ వ్యతిరేక ఉద్యమ స్టీరింగ్‌ కమిటీ ఏర్పాటు చేశారు. స్టీరింగ్‌ కమిటీ చైర్మన్‌గా ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు ఎన్నికయ్యారు.

అబ్కారీ శాఖ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న బీజేపీ మహిళా మోర్చా సభ్యులు

తెలంగాణలో చీప్ లిక్కర్‌కు వ్యతిరేకంగా బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నాంపల్లిలో అబ్యారీ శాఖ కార్యాలయం ఎదుట చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. తెలంగాణలో చీప్ లిక్కర్ ప్రవేశపెట్టడానికి వ్యతిరేకంగా మహిళలు శనివారం ఆందోళన చేపట్టారు.

చీప్ లిక్కర్ ప్రవేశపెట్టి ప్రజలను తాగుబోతులను చేస్తోందంటూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ ధర్నాలో బీజేపీ శాసనసభా పక్షనేత లక్ష్మణ్, పలువురు మహిళా నేతలు ధర్నాలో పాల్గొన్నారు. ధర్నా చేస్తున్న మహిళలను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రికత్త నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+