వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గులాబీ పార్టీలో గుబులు: చంద్రబాబు ఎంట్రీతో బలపడిన ప్రజాకూటమి

|
Google Oneindia TeluguNews

Recommended Video

Telangana Elections 2018 : గులాబీ పార్టీలో గుబులు.. చంద్రబాబు ఎంట్రీ | Oneindia Telugu

తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఇప్పటి వరకు 100కు సీట్లు పైగా వస్తాయని ఢంకా బజాయించి మరీ చెప్పిన టీఆర్ఎస్ పార్టీ గొంతులో ఇప్పుడు ఆ వేడి కనిపించడంలేదు. ఇప్పటి వరకు చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్న కారుపార్టీ నేతలు ఇతర పార్టీల వైపు చూస్తుండటంతో కాస్త మెత్తబడినట్లు కనిపిస్తోంది. మరోవైపు ప్రజాకూటమి బలం పుంజుకుంటుండం కూడా టీఆర్ఎస్ కలవరపాటుకు ఒక కారణం కావొచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ప్రజకూటమి వెనక రాజకీయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నడిపిస్తున్నారని టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. చంద్రబాబు అపార రాజకీయ అనుభవాన్ని ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో ప్రయోగిస్తున్నట్లు తెలుస్తోంది.

గత రెండేళ్లుగా వినిపించన టీడీపీ గొంతు

గత రెండేళ్లుగా వినిపించన టీడీపీ గొంతు

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ విభజన తర్వాత తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడింది. ఇక 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయఢంకా మోగించి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక తెలుగుదేశం పార్టీ టికెట్ పై గెలిచిన నేతలు సైకిల్ దిగి కారు ఎక్కారు. రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు పాలనను అమరావతికి మార్చారు. దీంతో తెలంగాణలో తెలుగుదేశం పై పట్టుకోల్పోయారు. గత రెండేళ్లుగా తెలంగాణలో తెలుగుదేశం వాణి వినిపించలేదు. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో టీడీపీ స్వరం వినిపిస్తోంది. ఇందుకు కారణం ప్రజాకూటమి.

అమరావతికి వెళ్లి పోవడంతో తెలంగాణలో పార్టీకి బీటలు

అమరావతికి వెళ్లి పోవడంతో తెలంగాణలో పార్టీకి బీటలు

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో టీడీపీకి చాలా బలమైన క్యాడర్ ఉండేది. ఇది సీమాంధ్ర కంటే ఎక్కువగానే ఉండేది. ఇక అమరావతికి చంద్రబాబు వెళ్లిన తర్వాత తన దృష్టి అంతా ఏపీ రాజకీయాలపైనే పెట్టడంతో తెలంగాణలో టీడీపీకి బీటలు పడ్డాయి. కేవలం హైదరాబాదుకు వచ్చినప్పుడే చంద్రబాబు టీడీపీ నేతలతో సమావేశం అయ్యేవారు. దీంతో ఆ పార్టీ చాలా బలహీనంగా తయారైంది. ఎంతలా అంటే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒక్క సీటు మాత్రమే గెలుచుకోగలిగింది.

జగన్‌పై దాడి జరిగితే.. మమ్మల్ని ఏ1, ఏ2లంటారా?: చంద్రబాబు ఆగ్రహం, ‘తక్కువ అంచనావేయొద్దు' జగన్‌పై దాడి జరిగితే.. మమ్మల్ని ఏ1, ఏ2లంటారా?: చంద్రబాబు ఆగ్రహం, ‘తక్కువ అంచనావేయొద్దు'

గులాబీ నేతలకు గుబులు పుట్టిస్తున్న చంద్రబాబు పేరు

గులాబీ నేతలకు గుబులు పుట్టిస్తున్న చంద్రబాబు పేరు

ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో బలమైన కేసీఆర్ పార్టీని కూలదోసేందుకు విపక్షాలు అన్ని ప్రజాకూటమి పేరుతో ఒక్కటయ్యాయి. దీంతో మళ్లీ చంద్రబాబు నాయుడు పేరు గులాబీ నేతలకు గుబులు పుట్టిస్తోంది. ప్రధాన విపక్షం కాంగ్రెస్ కంటే చంద్రబాబు నాయుడుపైనే టీఆర్ఎస్ పార్టీ దృష్టి సారించింది. ఆయన్ను లక్ష్యంగా చేసుకుని తమ ప్రచార పర్వాన్ని సాగిస్తోంది. అంతేకాదు తెలంగాణలో కనీసం చంద్రబాబు ఒక ఓటరు కానప్పటికీ ఆయన్నే సీఎం అభ్యర్థిగా టీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. గత వారంరోజులుగా గులాబీ పార్టీ నెంబర్ టూగా ఉన్న కేటీఆర్, నెంబర్ త్రీగా ఉన్న హరీష్ రావులు చంద్రబాబుపై మిరియాలు కారాలు నూరుతున్నారు. ప్రజాకూటమి అధికారంలోకి వస్తే తెలంగాణను చంద్రబాబు తిరిగి శాసిస్తారని ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ ప్రచారంలో చెబుతున్నారు.

 చంద్రబాబు ఇమేజ్‌తో బలపడనున్న ప్రజాకూటమి

చంద్రబాబు ఇమేజ్‌తో బలపడనున్న ప్రజాకూటమి


మరోవైపు అధికారాన్ని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఇస్తారా లేక తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు ఇస్తారా అంటూ మరో ఆపద్ధర్మ మంత్రి హరీష్ రావు ఓటర్లను అడుగుతున్నారు. ఇదిలా ఉంటే చంద్రబాబును టార్గెట్ చేయడం వెనక ఓ కారణం కూడా ఉందటోంది గులాబీ దండు. ఇలా చేయడం వల్ల తెలంగాణ ఓట్లు టీఆర్ఎస్‌కే ఉంటాయని భావిస్తోంది. విపక్ష పార్టీల్లో కేసీఆర్‌ను ఢీకొట్టగలిగే నేతలు ఎవరూ లేరని చెబుతోన్న టీఆర్ఎస్ నేతలు... తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో చంద్రబాబు ఇమేజ్ తమకు ఇబ్బందిగా మారే అవకాశం ఉందని తద్వారా ప్రజాకూటమి బలపడే ఛాన్స్ ఉందని గులాబీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు.

English summary
TD president and AP Chief Minister N. Chandrababu Naidu, who had lost ground in Telangana state, has suddenly turned into a key player in the upcoming Assembly elections, all thanks to the Prajakutami and, ironically, the TRS.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X