కేసీఆర్ యాగానికి రేపు చంద్రబాబు: అంబానీతో అరగంట భేటీ
హైదరాబాద్: లోక కల్యాణం కోసం మెదక్‌జిల్లా ఎర్రవల్లిలోని వ్యవసాయక్షేత్రంలో తెలంగాణ సీఎం కేసీఆర్ తలపెట్టిన అయుత మహా చండీయాగంలో చివరి రోజైన 27వ తేదీ(ఆదివారం)నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు.
చండీయాగం చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. వరుస సెలవులు భారీగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. చివరి రోజున నిర్వహించనున్న పూజల కోసం రెండు వేల కేజీల పసుపు, రెండు వేల కేజీల కుంకుమను సిద్ధం చేశారు. ఈ పసుపును కేసీఆర్ ఇంట్లో పట్టడం విశేషం.
ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో చండీయాగానికి సీఎం చంద్రబాబు హాజరుకావాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. చంద్రబాబుతో పాటు కేంద్రమంత్రులు సుజనాచౌదరి, అశోక్‌గజపతిరాజు కూడా చండీయాగానికి హాజరవుతారు. వీరితో పాటు ఏపీ కేబినెట్‌లో కొందరు మంత్రులు కూడా యాగానికి రానున్నట్టు తెలుస్తోంది.

ఏపీ సీఎం చంద్రబాబుతో ప్రముఖ పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీ భేటీ అయ్యారు. విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో శనివారం చంద్రబాబుతో సుమారు అరగంట సేపు వీరిద్దరూ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు విషయాలపై చర్చించారు. రాష్ట్రంలో 4జీ సేవలు, గ్రామాలకు సాంకేతికత అనుసంధానంపై చర్చించారు. అనంతరం అనిల్ అంబానీ తిరిగి పయనమయ్యారు.
ఐదోరోజు యాగంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పాల్గొననున్న నేపథ్యంలో ఏర్పాట్లపై ఇప్పటికే కేసీఆర్‌తో గవర్నర్ చర్చించారు. దీంతో ఎర్రవల్లిని భద్రతా దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. చంద్రబాబు ఆహ్వానం మేరకు అమరావతి రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి సీఎం హోదాలో కేసీఆర్ హాజరయ్యారు.
దీంతో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పడింది. ఆయుత చండీయాగానికి హాజరు కావాల్సిందిగా ఏపీ సీఎం చంద్రబాబు ఇంటికి వెళ్లి మరీ కేసీఆర్ ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు చండీయాగానికి హాజరవుతానని హామీ ఇచ్చారు.
రాష్ట్ర విభజన జరిగి రెండు రాష్ట్రాలు ఆవిర్భవించిన నేపథ్యంలో ఆయా రాష్ట్రాల అభివృద్ధి, అభ్యున్నతి కోసం విభేదాలను పక్కనబెట్టి సఖ్యతగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. కేసీఆర్ తలపెట్టిన అయుత మహా చండీయాగం శనివారంతో నాలుగో రోజుకు చేరుకుంది.
నాలుగో రోజు యాగంలో భాగంగా తమిళనాడు గవర్నర్ రోశయ్య, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్వీ రమణలు పాల్గొన్నారు. వరుస సెలవులు రావడంతో ఎర్రవల్లిలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. భక్తుల రద్దీ దృష్టా పోలీసు బందోబస్తును రెట్టింపు చేశారు. రాత్రి 10 గంటల వరకు యాగశాలను సందర్శించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు.
108 హోమగుండాలతో 1500 మంది రుత్విక్కులు, 5 రోజులపాటు 10 వేల సప్తశతి పారాయణలను, చండీ నవాక్షరి జపాలను జపిస్తున్నారు. ఆయుత చండీయాగం జరిగే ఎర్రవల్లిలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. 27 వరకు జరగనున్న ఈ ఆయుత చండీయాగాన్ని శృంగేరి శారదా పీఠం నుంచి ఇక్కడి నుంచి వచ్చిన 6గురు ప్రధాన రుత్విజుల పర్యవేక్షణలో ఈ యాగం జరగుతుంది.
యాగాన్ని తిలకించేందుకు విచ్చేస్తున్న ప్రముఖులు, ఆధ్యాత్మిక వేత్తల రాకతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. యాగశాల వద్ద 4వేల మంది తిలకించే విధంగా ఏర్పాట్లు చేశారు. రోజూ 50వేల మందికి అన్నదానం చేసే విధంగా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. దాదాపు 3,300 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. యాగశాల చుట్టూ 5కిలోమీటర్ల వరకు సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు.
-
తెలుగు ప్రజలకు సీఎం చంద్రబాబు, రేవంత్‌రెడ్డి "ఉగాది" స్పెషల్ విషెస్ !!! -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే?












Click it and Unblock the Notifications