మాజీ సీఎస్ సోమేశ్ అభ్యర్ధనపై సీఎం జగన్ కీలక నిర్ణయం..!!

ఐఏఎస్ సోమేశ్ కుమార్ అభ్యర్ధన పైన ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

తెలంగాణ సీఎస్ గా పని చేసిన సోమేశ్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టు ఆదేశాలతో ఏపీ ప్రభుత్వంలో రిపోర్టు చేసిన సోమేశ్ కు ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వలేదు. సీనియర్ అధికారి అయిన సోమేశ్ కు పోస్టింగ్ ఇవ్వకపోవటం పైన అధికార వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ సాగింది. రాష్ట్ర విభజన సమయంలో సోమేశ్ కుమార్ ను డీఓపీటీ ఏపీకి కేటాయించింది. దీని పైన క్యాట్ కు వెళ్లిన సోమేశ్ తెలంగాణలో కొనసాగేలా ఉత్తర్వులు పొందారు. దీని పైన కేంద్రం హైకోర్టును ఆశ్రయించింది. సుదీర్ఘ కాలం తరువాత హైకోర్టులో జరిగిన విచారణ మేరకు సోమేశ్ ను వెంటనే ఏపీలో రిపోర్టు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో..సీఎస్ గా ఉన్న సోమేశ్ కుమార్ వెంటనే రిలీవ్ అయ్యారు.

కోర్టు ఆదేశాలతో ఏపీలో రిపోర్టింగ్

కోర్టు ఆదేశాలతో ఏపీలో రిపోర్టింగ్


కోర్టు ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు చేసారు. ఏపీకి వెళ్లిన సోమేశ్ ముందుగా సీఎస్ జవహర్ రెడ్డి.. ఆ తరువాత సీఎం జగన్ తో సమావేశమయ్యారు. ఏపీలో రిపోర్టు చేసిన సమయానికి సోమేశ్ సీనియర్ అధికారి. ఆయన సీనియార్టీకి తగిన విధంగా పోస్టు ఏపీలో ఖాళీ లేదు. సీఎస్ గా జవహర్ రెడ్డిని మార్చే ఛాన్స్ లేదు. సీఎంఓలోనూ అప్పటికే సీనియర్లు ఉన్నారు. దీంతో..సోమేశ్ కు ఏ పోస్టు ఇస్తారనే చర్చ సాగింది. కానీ, సోమేశ్ మాత్రం సీనియార్టీతో సంబంధం లేదని.. ఏ పోస్టు ఇచ్చినా తన పని తాను చేసుకుంటానని స్పష్టం చేసారు. కానీ, ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వం సోమేశ్ కు పోస్టింగ్ ఇవ్వలేదు. ఈ సమయంలోనే సోమేశ్ స్వచ్చంద పదవీ విరమణకు దరఖాస్తు చేసారు. తాజాగా సీఎం జగన్ సోమేశ్ అభ్యర్ధన మేరకు వీఆర్ఎస్ కు ఆమోదించారు.

సీఎం జగన్ కు సోమేశ్ రిక్వెస్ట్

సీఎం జగన్ కు సోమేశ్ రిక్వెస్ట్


అయితే, సోమేశ్ తెలంగాణ నుంచి రిలీవ్ అయి ఏపీలో రిపోర్టింగ్ సమయంలోనే వీఆర్ఎస్ తీసుకుంటారనే ప్రచారం సాగింది. కానీ, తాను ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని..అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని సోమేశ్ చెప్పుకొచ్చారు. వీఆర్ఎస్ తీసుకోవాలంటే ముందుగా కోర్టు ఆదేశాల మేరకు ఏపీలో రిపోర్టు చేయాల్సి ఉండటంతో..చేసినట్లుగా సమాచారం. అదే సమయంలో ముఖ్యమంత్రికి వ్యక్తిగతంగా తనకు వీఆర్ఎస్ తీసుకొనేందుకు అవకాశం ఇవ్వాలని సోమేశ్ కోరినట్లు సమాచారం. దీంతో..సోమేశ్ వీఆర్ఎస్ కు సీఎం జగన్ ఆమోదం తెలిపారు. ఇప్పుడు ఆయన సర్వీసు స్వచ్చంద పదవీ విరమణకు దరఖాస్తు చేయటం.. ముఖ్యమంత్రి ఆమోదించటంతో మరోసారి సోమేశ్ తదుపరి అడుగులు ఏంటనే చర్చ మొదలైంది.

సోమేశ్ నెక్స్ట్ స్టెప్ ఎటు

సోమేశ్ నెక్స్ట్ స్టెప్ ఎటు


ఐఏఎస్ సోమేశ్ కుమార్ కు పాలనా పరంగా సుదీర్ఘ అనుభవం ఉంది. డిసెంబర్ నెలాఖరు వరకు సోమేశ్ సర్వీసులో కొనసాగేందుకు సమయం ఉంది. సోమేశ్ అనుభవాన్ని ఆయన పదవీ విరమణ తరువాత వినియోగించుకోవాలని సీఎం కేసీఆర్ ఆలోచనగా సమాచారం. కానీ, ఇప్పుడు హైకోర్టు తీర్పుతో చోటు చేసుకున్న పరిణామాలతో సోమేశ్ వీఆర్ఎస్ తీసుకుంటున్నారు. ఇక..అధికారికంగా ఆమోదం పొందన తరువాత సోమేశ్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు భవిష్యత్ అడుగులు వేసే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా..లేదా బీఆర్ఎస్ జాతీయ స్థాయిలో సోమేశ్ సేవలను వినియోగించుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది. సోమేశ్ తదుపరి అడుగుల పైన వచ్చే వారం స్పష్టత వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+