తెలంగాణలో జనసేన పై పవన్ కీలక నిర్ణయం, ఇక నుంచి..!!

తెలంగాణ జనసేన శ్రేణులకు పవన్ కీలక దిశా నిర్దేశం చేసారు. పార్టీ నేతల భేటీలో తన లక్ష్యాల ను స్పష్టం చేసారు. తెలంగాణ నేల తనకు పోరాడే ధైర్యాన్ని ఇచ్చిందని, ఈ ప్రాంత ప్రజల స్ఫూర్తే తనను ముందుకు నడిపించిందని చెప్పారు. తెలంగాణలో పార్టీ పరంగా తీసుకోవాల్సిన చర్యల పైన పవన్ సూచనలు చేసారు. వ్యక్తిగతంగా ఎవ్వరూ తనకు శత్రువులు కాదని పవన్ స్పష్టం చేస్తూనే... తెలంగాణలో పార్టీ నేతలు చేపట్టాల్సిన కార్యక్రమాల పైన క్లారిటీ ఇచ్చారు.

జగిత్యాల జిల్లా కొండగట్టు అంజనేయస్వామి ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ప‌వ‌న్‌ కల్యాణ్‌ సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. భక్తుల వసతుల కోసం నిర్మించనున్న 96 గదుల ధర్మశాల, దీక్షా విరమణ మందిరానికి ప‌వ‌న్‌ కల్యాణ్‌ శంకుస్థాపన చేసారు. ఈ నిర్మాణాలకు భక్తుల విరాళాల ద్వారా రూ.35.19 కోట్లు సమకూరినట్లు అధికారులు తెలిపారు. ఆ తరువాత పార్టీ కార్యకర్తల సమావేశంలో పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. రాజకీ యాల్లో గెలుపు-ఓటములు సహజమని, అయితే పోటీ చేయడం అలవాటు చేసుకోవాల్సిన అవ సరం ఉందని ఆయన అన్నారు. అంజన్న సన్నిధి తనను కాపాడిందని పవన్ పేర్కొన్నారు. కష్టకాలంలో ఆధ్యాత్మిక బలం తనకు అండగా నిలిచిందని పేర్కొన్నారు. ఓటమికి భయపడకుండా పోటీ చేసే మనస్తత్వం జనసేనలో పెరగాలని సూచించారు. పోటీ పడినప్పుడే అనుభవం వస్తుందని, ప్రజల మధ్య ఉండగలమని తెలిపారు. వ్యక్తిగతంగా ఎవ్వరూ తనకు శత్రువులు కాదని స్పష్టం చేసారు.

ap-dy-cm-pawan-kalyan-key-directions-for-telangana-janasena-leaders

రాజకీయ జీవితంలో తనకు పోరాట పటిమతో పాటుగా తెగింపు అన్నీ తెలంగాణ నుంచే వచ్చాయని చెప్పుకొచ్చారు. తమ పోరాటం వ్యక్తులపై కాదని, పాలసీ ప్రకారమే జరుగుతుందని అన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం, సరైన విధానాల కోసం మాత్రమే తాము రాజకీయాల్లో పోరాటం చేస్తున్నామని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం జన సైనికులు ముందు నిలబడాలని సూచించారు. ప్రజల మధ్య ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిన బాధ్యత ప్రతి జనసైనికుడిపై ఉందని అన్నారు. వంద మైళ్ల ప్రయాణం కూడా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. జనసేన ప్రయాణం ఇప్పుడు బలంగా మొద లైందని, ముందున్న లక్ష్యాన్ని సాధించేందుకు అందరూ కలిసి పనిచేయాలని కార్యకర్తలకు పవన్ నిర్దేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+