మహిళలకు సీఎం జగన్ గుడ్ న్యూస్ - లక్షలాది మంది కల సాకారం ..!!

ఎన్నికల వేళ ముఖ్యమంత్రి జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా రెండో విడత ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి వచ్చే సంక్రాంతి పండుగ కానుకగా ఇవ్వాలని నిర్ణయించారు. జిల్లాల వారీగా లెక్కలు వేసి లక్ష్యాలను నిర్దేశించారు. జనవరి నుంచి సామాజిక పెన్షన్ రూ 3 వేలకు పెంపుతో పాటుగా పథకాల నిధుల విడుదలకు జనవరి..ఫిబ్రవరి మాసాల్లో అమలు చేసే విధంగా కార్యాచరణ సిద్దం చేస్తున్నారు.

సంక్రాంతి లక్ష్యంగా
ముఖ్యమంత్రి జగన్ నవరత్నాల అమల్లో వేగంగా అడుగులు వేస్తున్నారు. ప్రతి పేదింటి మహిళలకు సొంతింటి కలను నెరవేర్చాలన్న సంకల్పంతో ఉన్న ముఖ్యమంత్రి వచ్చే సంక్రాంతి నాటికి రాష్ట్రంలో మరో ఐదు లక్షల పేదల ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేయాలని నిర్దేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 30.75 లక్షల ఇళ్ల పట్టాలను పంపిణీ చేసారు.

AP Govt Decided to Distribute second phase housing before Pongal, Orders issued

పంపిణీ చేసిన స్థలాల్లో పక్కా ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం పేదలకు కొండంత అండగా నిలిచి, ఇళ్ల నిర్మాణాలు చేపడుతోంది. దీంతో ఏన్నో ఏళ్లగా సొంతింటి కల నేర వేర్చుకోలేని వారంతా ఇప్పుడు తమ ఇంటి కలను సాకారం చేసుకుంటున్నారు. భూముల ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో తక్కువ స్థలంలోనైనా అందమైన ఇళ్లను నిర్మించుకుంటున్నారు.

రెండో విడత నిర్మాణాలపై
ప్రభుత్వం పంపిణీ చేసి 30.75 లక్షల ఇంటి స్థలాలకు గాను 22 లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతులు కూడా ఇచ్చారు. ఇందులో మొదటి దశ కింద ఐదు లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేయగా, రెండో విడతగా సంక్రాంతి పండుగ నాటికి మరో ఐదు లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

సంక్రాంతి నాటికి ఐదు లక్షల ఇళ్ల నిర్మాణాల్లో భాగంగా ఇప్పటికే 98,308 ఇళ్ల నిర్మాణం పూర్తయినట్లు గృహ నిర్మాణశాఖ అధికారులు చెబుతున్నారు. మిగిలిన 4 లక్షలకు పైగా ఇళ్లను నిర్దేశించుకున్న లక్ష్యంలోగా పూర్తిచేసి పేదలకు అందించేందుకు గృహ నిర్మాణ శాఖ శరవేగంగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం నిర్మాణాలు జరుగుతున్న ఇళ్ల నిర్మాణాల్లో 12,479 ఇళ్లు పూర్తి దశలో ఉండగా, లక్ష ఇళ్ల వరకు రూప్‌ లెవల్లో ఉన్నాయి.

ఎన్నికల వేళ కీలకంగా
మరో మూడు లక్షల ఇళ్లు పునాది దశల్లో ఉండటంతో ఆ ఇళ్లను శర వేగంగా పూర్తి చేసేందుకు గృహ నిర్మాణశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఒక్కో ఇంటి నిర్మాణం నిమిత్తం యూనిట్‌కు రూ.1.80 లక్షల బిల్లు మంజూరు చేయడంతో పాటు, స్వయం సహాయక బృందాల ద్వారా లబ్ధిదారులైన మహిళలకు పావలా వడ్డీకి రూ.35 వేలు రుణసాయం కూడా చేస్తోంది. ఇళ్ల నిర్మాణాలకు ఉచితంగా ఇసుకను పంపిణీ చేయడం ద్వారా రూ.15 వేలు.. స్టీల్‌, సిమెంట్‌, ఇలా 12 రకాల నిర్మాణ సామగ్రిని సబ్సిడీపై సరఫరా చేయడం ద్వారా రూ.40 వేలు చొప్పున మొత్తంగా రూ.2.70 లక్షల చొప్పున అదనంగా లబ్ధిచేకూరుస్తోంది. సంక్రాంతి పండుగ రోజున సొంతింటిలోకి వెళుతున్నామనే ఆనందం వారిలో కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+