వరుసగా ఎదురుదెబ్బలు: గజల్ శ్రీనివాస్‌కు చంద్రబాబు ప్రభుత్వం షాక్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: గాయకుడు గజల్ శ్రీనివాస్‌కు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం షాకిచ్చింది. స్వచ్ఛాంధ్ర మిషన్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ఆయనను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల గజల్‌ శ్రీనివాస్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ చర్య తీసుకుంది.

వీడియోలేవి, పార్వతి మాటేమిటి: పోలీస్‌లకు కోర్టు షాక్, ప్రశ్నల వర్షం, గజల్ శ్రీనివాస్‌కు చుక్కెదురు

ఇప్పటికే ఒక్కొక్కటిగా బయటపడుతున్న వీడియోలతో సేవ్ టెంపుల్ బ్రాండ్ అంబాసిడర్‌‌గా తొలగింపుతో తీవ్ర నైరాశ్యంతో ఉన్న గజల్‌కు ఇప్పుడు ఏపీ సర్కార్ కోలుకోలేని షాకిచ్చింది. ఆయనపై సాంస్కృతిక సంఘాలు కూడా మండిపడ్డాయి. ఆయనపై సమాజిక బహిష్కరణ విధిస్తున్నట్లు ఆనందలహరి సాంస్కృతిక సంస్థ చెప్పింది.

 గజల్ తర్వాత ఎవరనేది సోమవారం స్పష్టత!

గజల్ తర్వాత ఎవరనేది సోమవారం స్పష్టత!

గజల్ శ్రీనివాస్ ఇప్పటి వరకు ఏపీ స్వచ్ఛాంధ్ర బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. లైంగిక ఆరోపణల నేపథ్యంలో ఆయనను కొనసాగించే ప్రసక్తే లేదని నిర్ణయించింది. ఉత్తర్వులు జారీ చేసింది. గజల్ అనంతరం బ్రాండ్ అంబాసిడర్ ఎవరన్న విషయంపై సర్కార్ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఈ విషయంపై సోమవారం లోపు స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

 అనర్హుడని భావించి

అనర్హుడని భావించి

గజల్ శ్రీనివాస్‌పై వచ్చిన ఆరోపణలు, అందుకు బలమైన సాక్ష్యాల నేపథ్యంలో స్వచ్చాంధ్ర ప్రదేశ్ ప్రచారకర్త పదవికి ఆయన అనర్హుడని భావించి, ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు వెల్లడించారు. 2017 మే 28న స్వచ్ఛాంధ్ర మిషన్ బ్రాండ్ అంబాసిడర్‌గా గజల్ శ్రీనివాస్‌ను ఏపీ ప్రభుత్వం నియమించింది.

 మరోసారి బెయిల్ పిటిషన్

మరోసారి బెయిల్ పిటిషన్

గజల్ శ్రీనివాస్ మరోసారి బెయిల్ పిటిషన్ వేయనున్నారు. రెండు రోజుల క్రితం ఆయనకు కోర్టులో బెయిల్ మంజూరు కాలేదు. ఈ నేపథ్యంలో మరోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేసేందుకు ఆయన తరఫు న్యాయవాది సిద్ధమయ్యారు.

 గజల్ బాధితులు ఉన్నారా

గజల్ బాధితులు ఉన్నారా

ఇదిలా ఉండగా, గజల్ శ్రీనివాస్ పని మనిషి పార్వతి పట్టుబడితో మరిన్ని విషయాలు వెలుగు చూస్తాయని భావిస్తున్నారు. గజల్ బాధితులు మరికొందరు ఉన్నారని బాధితురాలు చెబుతున్నారు. గజల్ బాధితులు భయపడకుండా వచ్చి ఫిర్యాదు చేయవచ్చునని పోలీసులు చెబుతున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Andhra Pradesh Government removes singer Ghazal Srinivas from Swachh Andhra Mission.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి