బీజేపీకి భారీ షాక్: కాంగ్రెస్‌లోకి జితేందర్ రెడ్డి, వరించిన కీలక పదవి

హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల ముందు భారతీయ జనతా పార్టీకి భారీ షాక్ తగిలింది. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం కాంగ్రెస్ పెద్దల సమక్షంలో ఆయన హస్తం గూటికి చేరారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జీ దీపాదాస్ మున్షి.. జితేందర్ రెడ్డికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మహబూబ్‌నగర్ ఎంపీ టికెట్ ఆశించిన జితేందర్ రెడ్డికి బీజేపీ అవకాశం కల్పించకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు గురువారం జితేందర్ రెడ్డి నివాసానికి వెళ్లి కలిశారు.

AP Jithender reddy resigns for BJP joins Congress Key post in telangana govt for him

ఈ నేపథ్యంలోనే జితేందర్ రెడ్డి బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడం గమనార్హం. అయితే, కాంగ్రెస్ పార్టీలో చేరిన వెంటనే జితేందర్ రెడ్డిని కీలక పదవి వరించింది. ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు(క్రీడా వ్యవహారాలు) నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

మల్లు రవి స్థానంలో..
కాగా, ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ప్రభుత్వం నియమించిన మాజీ ఎంపీ మల్లు రవి ఇటీవల ఆయన ఆ పదవికి రాజీనామా చేశారు. నాగర్‌ కర్నూల్‌ నుంచి లోకసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నందున మల్లు రవి ప్రత్యేక ప్రతినిధి పదవికి రాజీనామా చేసినట్లు తెలిపారు. ఇవాళ పార్టీలో చేరిన జితేందర్‌ రెడ్డికి వెంటనే ఆయనను ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాంగ్రెస్‌ పార్టీలో చేరిన వెంటనే క్యాబినెట్‌ ర్యాంకు కలిగిన పదవిలో జితేందర్‌ రెడ్డిని నియమించడం గమనార్హం.

బండి సంజయ్ మార్పుతోనే బీజేపీకి నష్టం

అంతకు ముందు జితేందర్‌ రెడ్డి బీజేపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు తన రాజీనామా లేఖను పంపారు. రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ ఉన్నప్పుడు పార్టీ బలోపేతం అవుతూ వచ్చిందని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలోకి పార్టీని తీసుకుపోవడంలో బండి సంజయ్ విశేష కృషి చేశారని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 25 సీట్లు వస్తాయని అంచనా వేసుకోగా అధ్యక్షుడిని మార్చడం వల్ల కేవలం 8 సీట్లకే పరిమితం కావాల్సి వచ్చిందని వివరించారు. లోక్‌​సభ ఎన్నికల్లో కూడా ఇటీవల పార్టీలో చేరిన వారికే ప్రాధాన్యత ఇచ్చారని, దానిని నిరసిస్తూ రాజీనామా చేస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+