జూపల్లి తప్పించుకుంటున్నారు, మాకు అనుమతిలేని చోటుకు ఎలా వస్తాం?
హైదరాబాద్: పాలమూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులపై చర్చకు అసెంబ్లీ కమిటీ హాలుకు రావాలని మంత్రి జూపల్లి కృష్ణారావు పిలిచారని, మాజీ ఎమ్మెల్యేలమైన తాము సభాపతి అనుమతి లేకుండా కమిటీ హాలుకు ఎలా రాగలమని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు రావులచంద్రశేఖర రెడ్డి, కొత్తకోట దయాకర రెడ్డి ప్రశ్నించారు.
పాలమూరు ప్రాజెక్టుపై పార్టీల మధ్య వాగ్యుద్ధం జరుగుతోన్న విషయం తెలిసిందే. అసెంబ్లీ కమిటీ హాలుకు తాము వెళ్లడం అసాధ్యమని తెలిసి, టిడిపి నేతల్ని పిలిచినా రాలేదని చెప్పేందుకే అక్కడికి వెళ్లి కూర్చున్నారన్నారు.
మంత్రి పదవులను త్యాగం చేయాల్సి వస్తుందని ఇటీవల కెసిఆర్ తన మంత్రివర్గ సహచరులకు చెప్పారని, తన మంత్రి పదవిని ఎక్కడ త్యాగం చేయాల్సి వస్తుందోనని జూపల్లి రకరకాలుగా మాట్లాడుతున్నారని ఆరోపించారు.
చర్చకు ఎన్టీఆర్ భవన్ వస్తానని తొలుత సవాల్ చేసింది జూపల్లియేనని, ఆయన కోసం తాము ఎదురు చూశామని, ఆ తర్వాత ఆయన రాలేదన్నారు. అయితే, ఇప్పుడు సభాపతి అనుమతి లేకుండా తాము వెళ్లలేని చోటుకు ఆయన వెళ్లి కూర్చోవడం విడ్డూరమన్నారు. తాము చర్చకు ఎప్పుడూ సిద్ధమే అన్నారు.

డికె అరుణ
పాలమూరు జిల్లా ప్రాజెక్టుల పైన మాట్లాడే హక్కు టిడిపి, టిఆర్ఎస్ పార్టీలకు లేదని మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే డికె అరుణ అన్నారు.

కాంగ్రెస్
రూ.1000 కోట్లతో ఎనిమిది లక్షల ఎకరాలకు నీరు ఇచ్చే అవకాశమున్నప్పటికీ పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ పార్టీ మండిపడింది. పాలమూరు ఎత్తిపోతలపై సిఎం కెసిఆర్‌కు చిత్తశుద్ధి లేదన్నారు.

జూపల్లి
నారా చంద్రబాబు నాయుడు నాడు పెట్టిన బడ్జెట్ లెక్కలనే తాను చెబుతున్నానని తెలంగాణ రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణా రావు సోమవారం అన్నారు.

టిఆర్ఎస్
ప్రాజెక్టును ఆపాలని చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖ ఇచ్చినట్లు తాను రుజువు చేస్తానని చెప్పారు. 7,500 కోట్ల ప్రాజెక్టుకు చంద్రబాబు ఎంత ఖర్చు పెట్టారో చెప్పాలన్నారు. చర్చకు తాను ఒక్కడినే వస్తానని చెప్పారు.












Click it and Unblock the Notifications