వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ, తెలంగాణా జలజగడం: తాజాగా రాజోలిబండ రగడ; కృష్ణా బోర్డుకు తెలంగాణా లేఖ!!

|
Google Oneindia TeluguNews

ఏపీ ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడానికి కారణం కాగా, తాజాగా మరోమారు రెండు రాష్ట్రాల మధ్య రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ వివాదానికి కారణం గా మారింది. ఆమోదం పొందని ప్రాజెక్టును నిలిపివేయాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు గతంలో ఆదేశాలు జారీ చేసినప్పటికీ నిర్మాణ పనులతో ముందుకు వెళ్తున్న ఏపీ ప్రభుత్వాన్ని అడ్డుకోవాలని తెలంగాణ ప్రభుత్వం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు లేఖ రాసింది.

ఏపీ, తెలంగాణా రాష్ట్రాల మధ్య రాజోలిబండ డైవర్షన్ స్కీం రగడ

ఏపీ, తెలంగాణా రాష్ట్రాల మధ్య రాజోలిబండ డైవర్షన్ స్కీం రగడ


రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ కుడి కాలువ పనుల పై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు తెలంగాణ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు లేఖ రాశారు. కెనాల్ హెడ్ రెగ్యులేటర్ కోసం సివిల్ వర్క్స్ జరిపించడానికి ఏపీ ప్రభుత్వం తవ్వకాలు ప్రారంభించిందని ఆయన కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డ్ చైర్మన్ కు రాసిన లేఖలో తెలిపారు. ఇది ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 85(D) ని ఉల్లంఘించిన కారణంగా దీన్ని వెంటనే నిలిపివేయాలని కోరారు.

కృష్ణా బోర్డు ఆదేశాలు బేఖాతరు చేస్తూ ఆర్డీఎస్ కుడికాల్వ పనులు చేస్తున్న ఏపీ

కృష్ణా బోర్డు ఆదేశాలు బేఖాతరు చేస్తూ ఆర్డీఎస్ కుడికాల్వ పనులు చేస్తున్న ఏపీ

అలాగే నీటి కేటాయింపు సమస్య కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ వద్ద పెండింగ్లో ఉందని, వివాదం పరిష్కారం కాకముందే ఏపీ అక్రమ కట్టడానికి పాల్పడుతుందని ఆయన లేఖలో వెల్లడించారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఆదేశాలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనులు కొనసాగిస్తుందని లేఖలో పేర్కొన్న ఈఎన్సీ మురళీధర్, అనుమతి లేకుండా కొనసాగిస్తున్న కాలువ పనులను తక్షణం నిలిపివేయాలని, పనులు కొనసాగించకుండా ఏపీని అడ్డుకోవాలని లేఖలో కృష్ణ బోర్డ్ ను కోరారు.

 నీటి వివాదాల ట్రిబ్యునల్ వద్ద ఏపీ, తెలంగాణా ఆర్డీఎస్ పంచాయితీ

నీటి వివాదాల ట్రిబ్యునల్ వద్ద ఏపీ, తెలంగాణా ఆర్డీఎస్ పంచాయితీ

ఆర్డీఎస్ కుడి కాలువకు నీటి కేటాయింపులపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేయడంతో ప్రస్తుతం నీటి వివాదాల ట్రిబ్యునల్ వద్ద ఈ సమస్య పరిష్కారం కోసం పెండింగ్లో ఉంది. గతంలో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏపీకి నాలుగు టీఎంసీల నీటి కేటాయింపు జరపటంతో దీనిని వ్యతిరేకిస్తున్న తెలంగాణా దీనిపై పోరాటం చేస్తుంది. ఈ తీర్పును నిలిపివెయ్యాలని కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేసింది.

కృష్ణా బోర్డు ఆదేశాలను తుంగలో తొక్కుతున్న ఏపీ.. జోరుగా కాలువ నిర్మాణం

కృష్ణా బోర్డు ఆదేశాలను తుంగలో తొక్కుతున్న ఏపీ.. జోరుగా కాలువ నిర్మాణం


తుంగభద్ర పై రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ షెడ్యూల్ 2 క్రింద పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం గత ఏడాది నవంబరులో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డును కోరింది. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఆదేశాలను ఏపీ ప్రభుత్వం తుంగలో తొక్కుతున్నదని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తోంది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అనుసరిస్తూ తుంగభద్ర నది పై నిజాంకాలంలో కర్ణాటకలో నిర్మించిన ఆర్డీఎస్ ఆనకట్ట నుండి అక్రమంగా కాలువలు ఏర్పాటు చేసుకొని నీటిని తరలించడానికి ఏపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని, ఈ మేరకు గత ఏడాది జూన్ లోనే చర్యలు చేపట్టిందని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది.

కుడి కాలువ పనులు నిలిపివెయ్యాలని తెలంగాణా కేఆర్ఎంబీకి లేఖ

కుడి కాలువ పనులు నిలిపివెయ్యాలని తెలంగాణా కేఆర్ఎంబీకి లేఖ


కృష్ణ బోర్డు, సిడబ్ల్యుసి, కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వ అనుమతులు లేకుండానే కుడి కాలువ పనులను వేగవంతంగా ఏపీ ప్రభుత్వం పూర్తి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ క్రమంలోనే ఆర్డీఎస్ కుడి వైపు కెనాల్ పనులు చేపట్టకుండా ఆదేశాలు జారీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం మరోమారు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు లేఖ రాసింది.

English summary
Telangana has written another letter to the Krishna river management board to stop the RDS right canal works which are done by the ap govt without permission from KRMB
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X