వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేవంత్‌కు పీసీసీ, కోతికి కొబ్బరి చిప్ప -కాంగ్రెస్‌కు మరో షాక్ -కొట్లాడేది టీఆర్ఎస్సే: కేటీఆర్ -రమణ తర్వాత..

|
Google Oneindia TeluguNews

చంద్రబాబుకు గుడ్ బై చెప్పి, తెలంగాణలో టీడీపీ అధ్యక్ష పదవిని వదిలేసిన ఎల్.రమణ గులాబీ దళంలో చేరిన తర్వాత అధికార పార్టీకి మరింత ఊపొచ్చినట్లుంది. రమణ్ కారెక్కిన రోజే కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లు, మున్సిపల్ కౌన్సిలర్లూ పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్ లో చేరిపోయారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు..

ఏ వేవ్, ఎప్పడొస్తదో తెలియట్లేదు -ప్రభుత్వాలకూ అవగాహన కరువు -మళ్లీ ఫీవర్ సర్వే: కరోనాపై కేసీఆర్ఏ వేవ్, ఎప్పడొస్తదో తెలియట్లేదు -ప్రభుత్వాలకూ అవగాహన కరువు -మళ్లీ ఫీవర్ సర్వే: కరోనాపై కేసీఆర్

టీఆర్ఎస్‌లోకి భారీగా చేరికలు

టీఆర్ఎస్‌లోకి భారీగా చేరికలు

తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి, అధికార టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ చేరికలతో బిజీగా గడిపారు. టీటీడీపీ మాజీ చీఫ్ ఎల్. రమణను టీఆర్ఎస్ లోకి ఆహ్వానించిన ఆయనే.. కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులనూ గులాబీ దళంలో చేర్చుకున్నారు. మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో జవ‌హ‌ర్ న‌గ‌ర్ కార్పొరేష‌న్‌లోని న‌లుగురు కాంగ్రెస్ కార్పొరేట‌ర్లు, ఘ‌ట్‌కేస‌ర్ మున్సిపాలిటీకి చెందిన కాంగ్రెస్ కౌన్సిల‌ర్లు టీఆర్ఎస్ లో చేరారు.

తెగించి కొట్లాడేది టీఆర్ఎస్ ఒక్కటే

తెగించి కొట్లాడేది టీఆర్ఎస్ ఒక్కటే

కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ లో చేరిన సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఏపీతో జల వివాదాన్ని ప్రస్తావించారు. కృష్ణా జ‌లాల విష‌యంలో కానీ, మరింకే విష‌యంలో కానీ తెలంగాణ ప్రయోజనాలకై రాజీ లేకుండా తెగించి కొట్లాడే ఏకైక పార్టీ టీఆర్ఎస్ మాత్ర‌మే అన్నారు. కృష్ణా జలాలపై బీజేపీ, కాంగ్రెస్ నేత‌లు రెండు నాలుక‌ల ధోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

వైఎస్సార్ ద్రోహి, ఆయన వారసులనూ నమ్మొద్దు -ఆంధ్రా తొత్తులకు స్థానం లేదు :షర్మిలపై హరీశ్ రావు ఫైర్వైఎస్సార్ ద్రోహి, ఆయన వారసులనూ నమ్మొద్దు -ఆంధ్రా తొత్తులకు స్థానం లేదు :షర్మిలపై హరీశ్ రావు ఫైర్

Recommended Video

Weather Update : Two More Days Heavy Rains In AP & Telangana | Oneindia Telugu
 రేవంత్‌కు పీసీసీ, కోతికి కొబ్బరిచిప్ప

రేవంత్‌కు పీసీసీ, కోతికి కొబ్బరిచిప్ప

కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రాన్ని సాధించుకోవడమేకాదు, అభివృద్ధి బాట‌లో ప‌య‌నింప‌జేస్తున్నామ‌ని, అన్ని వ‌ర్గాల అభివృద్ధే ధ్యేయంగా టీఆర్ఎస్ ముందుకు పోతున్నదని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఎవ‌రెన్ని కుప్పిగంతులు వేసినా ప్రజలు మాత్రం టీఆర్ఎస్ ను, కేసీఆర్ నాయకత్వాన్నే విశ్వసిస్తున్నారన్న మంత్రి.. కొత్తగా కొన్ని పదవులు రాగానే కోతికి కొబ్బ‌రిచిప్ప దొరికిన‌ట్టు ప్ర‌వ‌ర్తిస్తున్నారని, అలాంటి వాళ్లను ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై పరోక్ష విమర్శలు చేశారు.

కేసీఆర్ నాయ‌క‌త్వ‌మే తెలంగాణ‌కు శ్రీరామ‌ర‌క్ష అని భావించడం వల్లే ఇతర పార్టీల నేతలూ టీఆర్ఎస్ లో చేరుతున్నారని మంత్రి అన్నారు.

English summary
Telangana minister ktr said that it is only trs party who fights for telangana well being without compromise. speaking at an event at hyderabad, ktr assured that trs and cm kcr will fight for krishna water. the minister also slams tpcc chief revanth reddy and other opponents.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X