ఎర్రబెల్లికి ఏపీ మంత్రులు టచ్ లో ఉన్నారా ? ఆ విషయం వారే చెప్పారా ?
శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు వచ్చాను అని చంద్రబాబు నాయుడు చెంపలు వేసుకున్నారని తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. తెలుగుదేశం పార్టీలోని కొందరు మిత్రులు ఇంకా తనతో టచ్లో ఉన్నారన్న విషయాన్ని చెప్పి ఎర్రబెల్లి సంచలనం సృష్టించారు. భువనగిరి లోనూ, వరంగల్ లోనూ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశాలలో పాల్గొన్న ఎర్రబెల్లి దయాకర్ రావు చేసిన వ్యాఖ్యలతో టిడిపి వర్గాలు ఉలికిపాటుకు గురయ్యాయి.
పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశాలలో ప్రసంగించిన ఆయన మంత్రి హోదాలో చాలా ఉద్వేగభరితంగా మాట్లాడారు. రాజకీయాల్లో ఇంతకాలం సీనియర్ గా ఉన్నా మంత్రిగా తన ఎవరు అవకాశం ఇవ్వలేదని ప్రస్తుతం తనకు అవకాశం ఇచ్చిన కేసీఆర్, కేటీఆర్ ల రుణం తాను తీర్చుకోలేనిది అని ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీకి తిరుగులేదు అని చెప్పిన ఆయన పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల్లో వరంగల్ జిల్లాలో 5 లక్షల భారీ మెజార్టీతో గెలిపించే బాధ్యత తమదని హామీ ఇచ్చారు. పార్టీలో అందరితోనూ కలుపుకుపోయి పని చేస్తానని, ఇంతకాలానికి తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. పార్లమెంటు ఎన్నికల్లోనూ ప్రజలు టిఆర్ఎస్ కే పట్టం కడతారు అన్నారు.

టీఆర్ఎస్ నాయకుల ముఖాల్లో కల్తీ ఉండొచ్చు కానీ కేసీఆర్,కేటీఆర్ ముఖాల్లో ప్రజలకు నిజాయితీ కనిపిస్తుందని, మరోమారు పార్లమెంట్ ఎన్నికల్లో 16 స్థానాలు గెలిపిస్తారని చెప్పారు. లోక్ సభ ఎన్నికల్లోనూ టిఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగర వేస్తుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు.
శాసనసభ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుని ప్రజలు తరిమి కొట్టారు అన్న ఎర్రబెల్లి తెలంగాణ లో ఎన్నికల్లో పోటీ చేసినందుకు చంద్రబాబు చెంపలేసుకుంటున్నారు అని వ్యాఖ్యానించారు .
దీంతో ఇప్పుడు ఎర్రబెల్లి దయాకర్ రావు తో టచ్ లో ఉన్న ముఖ్య నేతలు ఎవరు అన్న దానిపైన టిడిపి వర్గాల్లో చర్చ జరుగుతోంది . రానున్నది ఎన్నికల కాలం కావటంతో ఎర్రబెల్లి వ్యాఖ్యలతో టీడీపీలో టెన్షన్ నెలకొంది.












Click it and Unblock the Notifications