కేసీఆర్ అన్నట్లుగానే.. బీసీలకు ప్రాధాన్యత: టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులు వీరే

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) రాజ్యసభ అభ్యర్థులను ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఆదివారం సాయంత్రం ప్రకటించారు. మూడు టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థుల్లో రెండు స్థానాలను బీసీలకే ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు.

టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్ కుమార్ తోపాటు బడుగుల లింగయ్య యాదవ్, బండ ప్రకాశ్ ముదిరాజ్‌లను రాజ్యసభకు పంపించాలని టీఆర్ఎస్ నిర్ణయించింది.

Are they TRS Rajya Sabha candidates?

టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న జోగినపల్లి సంతోష్ కుమార్.. ఉద్యమ సమయం నుంచి కేసీఆర్‌ వెన్నంటి నడిచారు. కాగా, నల్గొండ జిల్లాకు చెందిన లింగయ్య యాదవ్ టీడీపీలో బలమైన నేతగా ఎదిగారు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో చేరి కీలకంగా మారారు.

Are they TRS Rajya Sabha candidates?

ఈ క్రమంలో కేసీఆర్.. లింగయ్యకు టికెట్ ఇచ్చి.. గతంలో చెప్పిన విధంగా యాదవులకు రాజ్యసభ టికెట్ ఇస్తానన్న మాటను నిలబెట్టుకున్నారు. ఇక వరంగల్ జిల్లాకు చెందిన బండ ప్రకాశ్ ముదిరాజ్‌కు కూడా కేసీఆర్ రాజ్యసభ టికెట్ ఇవ్వాలని నిర్ణయించారు. మంత్రి ఈటెల రాజేందర్ కు సన్నిహితుడైన బండ ప్రకాశ్ కు కూడా దాదాపు రాజ్యసభ టికెట్ ఖరారైంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Are they TRS Rajya Sabha candidates?.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి