స్థలం ఉండి ఇల్లు కట్టుకోపోలేతున్నారా.?ఇలా చేస్తే సర్కార్ నిధులు వచ్చేసినట్టే.!

హైదరాబాద్: స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని పేద ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకంపై సమీక్ష సమావేశాన్ని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మరియు రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ గురువారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ సెక్రటేరియట్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల తోపాటు గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ పాల్గొన్నారు.

సొంతింటి కలను నెరవేర్చుకోండి : ఇంటి స్థలం ఉన్న మహిళలు తమ పేరు మీద మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఓటర్ ఐడి, ఇంటి పత్రాలు, కరెంట్ బిల్లు, ఇంటి పన్ను రసీదు, బ్యాంకు పాస్ బుక్ జిరాక్స్ కాపీలతో మునిసిపల్ ఆఫీసులో గానీ తాసిల్దార్ కార్యాలయంలో గాని దరఖాస్తులు అందజేయాలని ఉన్నతాదికారులు తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని సొంతింటి కలను నెరవేర్చుకోవాలని సూచించారు.

 land
ఇండ్లులేని నిరుపేదల కోసం : ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఇండ్లులేని నిరుపేదల కోసం ఖాళీ స్థలం ఉండి సొంత ఇల్లు కట్టు కోవడానికి 3లక్షలు ఆర్ధిక సహాయం అందించే గృహలక్ష్మి కోసం దరఖాస్తు చేసుకేనూ విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. గ్రామ కంఠంలో ఉన్న పాత ఇల్లుకు గానీ, స్థలాలకు కానీ దస్తావేజు పేపర్లు ఉండవు కాబట్టి ఇంటి నంబర్ లేకపోయినా ఖాళీ స్థలం ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చన్నారు మంత్రి. దీనికి గడువు అయిపోయిందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు మంత్రి.
 land

నిరంతర ప్రక్రియ : దరఖాస్తుదారులు జిల్లా కలెక్టర్ కు ధరఖాస్తులు పంపించవచ్చని, ఇది నిరంతర ప్రక్రియ అన్నారు మంత్రి. ప్రతీ నియోజకవర్గానికి ప్రస్తుతం మొదటి దశలో 3వేల ఇండ్లు పూర్తి అయిన తర్వాత రెండో దశలో ఇచ్చే గృహలక్ష్మి కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దశల వారీగా అర్హులైన పేదల ఇంటి నిర్మాణం కోసం గృహలక్ష్మి అమలు చేస్తామని, ప్రతి పక్షాలు,కొన్ని పత్రికలు చేసే అసత్య ప్రచారాలు నమ్మొద్దని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+