యువతిపై గ్యాంగ్‌రేప్: భర్తకు వీడియో పంపి, వేధింపులు
ఓ యువతిపై నాలుగేళ్ళ క్రితం అత్యాచారానికి పాల్పడ్డారు దుండగులు. అయితే ఆమెపై అత్యాచారం చేస్తు ఆ దృశ్యాలను చిత్రీకరించారు. ఆ వీడియోను సాకుగా చూపి బాధిత యువతిని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.
హైదరాబాద్: ఓ యువతిపై నాలుగేళ్ళ క్రితం అత్యాచారానికి పాల్పడ్డారు దుండగులు. అయితే ఆమెపై అత్యాచారం చేస్తు ఆ దృశ్యాలను చిత్రీకరించారు. ఆ వీడియోను సాకుగా చూపి బాధిత యువతిని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. అంతేకాదు బాధితురాలి భర్తకు ఆ వీడియోను వాట్సాప్‌లో పంపారు. దీంతో భార్య,భర్తలు దూరంగా ఉంటున్నారు.
మహిళలపై రోజు రోజుకు దాడులు, దౌర్జన్యాలు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. పాలకులు ఎన్ని రకాల చర్యలు తీసుకొంటున్నా కానీ, మహిళలపై దారుణాలు మాత్రం ఆగడం లేదు.
అయితే స్నేహం, ప్రేమ పేరుతో యువతులను మోసం చేసే వారు కొందరైతే ... నమ్మించి గొంతు కోసే వారు మరికొందరున్నారు. అయితే మహిళలపై లైంగిక దాడులకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవల కాలంలో పెరిగిపోతున్నాయి.

యువతిపై రేప్, వీడియో తీశారు
నాలుగేళ్ళ క్రితం ఓ యువతిపై కర్ణాటక రాష్ట్రంలో కోలారు జిల్లా శ్రీనివాసపురానికి చెందిన యువతికి జ్యూస్‌లో మత్తు మందిచ్చి ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాదు ఆ యువతిపై అత్యాచారం చేసే సమయంలో ఆ దృశ్యాలను ఫోన్‌లో రికార్డ్ చేశారు. ఈ దృశ్యాలను చూపి బ్లాక్‌మెయిల్ చేసేవారు.

హైద్రాబాద్‌కు చెందిన యువకుడితో వివాహం
అయితే కొంత కాలం క్రితం హైద్రాబాద్‌కు చెందిన యువకుడితో ఆ యువతికి వివాహమైంది. వివాహమైన తర్వాత కూడ ఆ యువతికి నిందితుల నుండి వేధింపలు ఆగలేదు. వీడియోలను కుటుంబసభ్యులకు పంపుతామంటూ వేధించారు. బాధితురాలిని మానసికంగా వేధింపులకు గురిచేసేవారు.

వాట్సాప్‌లో భర్తకు రేప్ వీడియో
యువతిపై దుండగులు అత్యాచారానికి పాల్పడిన దృశ్యాలను నిందితులు ఆ యువతి భర్తకు వాట్సాప్‌లో పంపారు. ఈ దృశ్యాలు చూసిన తర్వాత బాధితురాలితో భర్త దూరంగా ఉంటున్నాడు. దీంతో నిందితులు మరింత రెచ్చిపోయారు. బాధితురాలికి ఫోన్ చేసి మరీ వేధిస్తున్నారు.

పోలీసులకు ఫిర్యాదు
నిందితుల వేధింపులు తట్టుకోలేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. శ్రీనివాసపురం పోలీస్‌స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. నిందితుల్లో ఒకడైన ఆరిఫ్‌ను అరెస్టు చేయగా తౌసిఫ్ పరారీలో ఉన్నాడు.పారిపోయిన నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.












Click it and Unblock the Notifications